Mutton Prices Hike: నాన్‌వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న మటన్ ధరలు.. కారణం ఇదేనట..
సండే వచ్చిందా.., ఫంక్షన్ ఉందా.., పార్టీ, పండగ వచ్చిందంటే చాలు యాటకూర ఉండాల్సిందే. అది లేకపోతే నోట్లోకి ముద్ద కూడా దిగదు చాలామందికి.. తినేవారి సంఖ్య పెరగడంకు తోడు కార్తిక మాసం ముగియడంతో ముక్క కోసం పరుగులు పెడుతున్నారు. దీంతో మార్కెట్లో ధరలు..

కార్తిక మాసం ముగిసింది. నాన్‌వెజ్ ప్రియులు మటన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే కిలో మటన్ రూ.850 పలుకుతుండగా.. రానున్న రోజుల్లో ఆల్ టైం గరిష్ఠానికి చేరుకుంటాయని మటన్ వ్యాపారులు అంటారు. ఈ ప్రభావం ఆదివారం నుంచి మటన్ ధర మరింత పెరిగుతుందని అంటున్నారు. కార్తీక మాసం కారణంగా.. మాంసానికి పెద్దగా డిమాండ్ లేకపోవటంతో ధరలు.. నవంబర్ 23న కార్తీక మాసం ముగిసిన తర్వాత మటన్ ధరలు ఏకంగా రూ.1000 మార్కును కూడా అధిగమించవచ్చని సూచిస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో మటన్ ధర రూ.800 నుంచి రూ. 850 పలుకుతోంది. ఫ్రెష్ మీట్ పేరుతో.. కొన్ని దుకాణాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ.. ఇప్పటికే నాలుగు అంకెల ధరలతో మటన్ అమ్మకాలు జరుగుతున్నాయి. కాగా.. గతేడాది ఇదే సమయానికి హైదరాబాద్‌లో కిలో మటన్ రూ. 500 నుంచి రూ. 550 వరకు ఉండగా.. కేవలం సంవత్సరం గ్యాప్‌లోనే దాని రేటు ఏకంగా డబుల్ అయ్యింది.
తినేవారి సంఖ్య పెరిగిందా..?!
తెలంగాణలో గడిచిన ఏడాదిలోనే మటన్ వినియోగం 50 శాతం పెరిగింది. రాష్ట్రంలో మేక పొట్టేలు మాసం దొరకక పోవడంతో గొర్రె పొట్టేలు మాంసానికి డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో సగటున 48 వేల నుంచి 50 వేల గొర్రెలను మటన్ కోసం కట్ చేస్తున్నారు. ఇందులో మూడో వంతు ఒక్క హైదరాబాద్‌లోనే అమ్ముతున్నరంటే ఏ స్థాయిలో మటన్ వినియోగం ఉందో అర్థం చేసుకోవచ్చు.
యాట తెగాల్సిదే..
ఇక వీకెండ్ వచ్చిందంటే చాలా యాట తెగాల్సిదే అనే రీతిలోకి మారిపోయారు హైదరాబాద్ మాంస ప్రియులు. ఫంక్షన్లలో మటన్ తప్పనిసరిగి మారిపోయింది. పొట్టేలు మార్కెట్ కు డిమండ్ కు అనుగుణంగా దిగుమతి లేకపోవడంతో మటన్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
ధరలు పెరగడానికి కారణాలు ఇవే..
అయితే తెలంగాణలో మటన్ ధరల పెరగడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యమైన కారణం మేకలు, గొర్రెల పెంపకం తగ్గిపోవడం. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టినా .. వీటిని పెంచేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో మార్కెట్‌కు అవసరమైనంత స్థాయిలో గొర్రెలు, మేకలు అమ్మకానికి రావడం లేదు. ఫలితంగా మటన్ వ్యాపారులు పక్క రాష్ట్రాల నుంచి గొర్రెలను దిగుమతి చేసుకుంటున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి..
ఇప్పుడు మన మార్కెట్లో దొరుకుతున్నవి మహారాష్ట్ర నుంచి వస్తున్న గొర్రెలు. అక్కడి నుంచి ఇక్కడి రావడానికి ట్రాన్స్‌పోర్టు ఖర్చులు పెరిగిపోయాని అంటున్నారు వ్యాపారులు. దీంతో హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా మటన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతోపాటు వ్యాపారులు కూడా కొంత ధరలను పెంచేస్తున్నారు.
ప్రభుత్వ అధికారుల నుంచి నియంత్రణ లేకపోవడంతో తమకు తోచిన రీతిలో ధరలను నిర్ణయిస్తున్నారు. పండుగలని, ఫంక్షలని పెద్దఎత్తున నిర్వహిస్తున్న కార్యక్రమాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లకు పెద్దఎత్తున వస్తున్న కస్టమర్లతో నగరంలో మాంసం వినియోగం.. ఈ ఏడాదిలో భారీగా పెరిగింది. మరోవైరు.. కరోనా కారణంగా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇష్టపడటం కూడా మాంసం డిమాండ్ పెరగడానికి కారణంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
