క్రికెట్ అభిమానుల వినుల విందు అందిస్తోన్న ఐపీలో కొందరి జీవితాల్లో మాత్రం విషాదాన్ని నింపుతోంది. మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయాల్సింది పోగా బెట్టింగ్‌ల పేరుతో ప్రాణాల మీదికే తెచ్చుకుంటున్నారు కొందరు. బెట్టింగ్ ఉచ్చులో ఇరుక్కుని అల్లాడిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఓ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని గిరాయి గుట్ట తండా పరిధిలోని నార్లగూడ తండాలో అంగోతు ప్రకాష్ అనే యువకుడు ఐపీఎల్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు.
బుధవారం రాత్రి జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌పై కూడా బెట్టింగ్ వేశాడు. పంజాబ్ గెలుస్తుందని ప్రకాష్ బెట్టింగ్ వేశాడు. అయితే ఈ మ్యా్‌చ్‌లో పంజాబ్ ఓటమి పాలు కావడం ప్రకాష్ ప్రాణాల మీదికి తెచ్చింది. బెట్టింగ్ డబ్బులు ఇవ్వాలని బలవంతం చేయడంతో.. డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ప్రకాష్ ఏం చేయాలో తెలియక మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హోరున విలపిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. యువత బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకొని ఇలా ప్రాణాలు వదలడం నిజంగా విచారకరం. ఉన్న ఒక్క జీవితాన్ని సంతోషంగా జీవించాలి కానీ ఇలా అద్యాంతరంగా ముగించడం తప్పుడు సరికాదు. తల్లిదండ్రులు, ఇంట్లో ఉండే పెద్దలు సైతం యువతపై ఓకన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..