TV9 Telugu: టీవీ9 వైపే తెలుగు ప్రజల చూపు.. న్యూస్ చానల్స్‌లో మళ్లీ నంబర్ 1
Updated on: May 18, 2023 | 2:50 PM

జస్ట్ టైమ్ గ్యాప్ అంతే... టైమింగ్‌లో తేడా ఉండదు. ఆంధ్రా, సీడెడ్, నైజాం అన్ని సెంటర్లలో ఒకటే రీసౌండ్. తెలుగు వారున్న ప్రతీ ఇంట్లో.. తెలుగు దనం ఉట్టిపడే ప్రతీ వాడలో.. తెలుగు వెలుగు ప్రసరిస్తున్న అన్ని ప్రాంతాల్లో... నెంబర్ వన్‌గా నిలిచింది టీవీ9.

రెండు దశాబ్దాల చరిత్రలో.. తెలుగు మీడియా కనీవినీ ఎరుగని రీతిలో... రేటింగ్స్ బాక్సే బద్దలయ్యే రేంజ్‌లో.. టీవీ9 నిలిచింది. నువ్వా నేనా అనే సంశయం లేనే లేదు. వారా.. వీరా అనే డౌట్ అక్కర్లేదు. జనం నాడి.. ఒకే వైపు... టీవీ9.. తగ్గేదే లే. తెలుగు ప్రజలు నమ్ముతున్న ఏకైక చానల్ టీవీ9.

ఖండాంతరాల్లో ఉన్న తెలుగు వారు ఆదరిస్తున్న ఏకైక న్యూస్ చానల్ టీవీ9 తెలుగు. దేశంలోనే నెంబర్ వన్ నెట్‌వర్క్‌గా ఉన్న టీవీ9 నెట్‌వర్క్.. అన్నిభాషల్లోనూ రారాజుగా ఉంది. తెలుగులోనూ తన సింహాసనాన్ని రాజసంగా అధిష్టించింది. హిందీ చానల్ అయిన టీవీ9 భారత్ వర్ష్, టీవీ9 కన్నడ, టీవీ9 మరాఠీ, టీవీ9 గుజరాతీ, టీవీ9 బెంగాలీ తోపాటు.. టీవీ9 తెలుగు అగ్రగామిగా ఉంది.

మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైమ్ నుంచి… మిడ్‌నైట్ వారధి వరకు.. అన్ని సెగ్మెంట్లలో.. విభిన్న వార్తలు… ప్రజలకు అందిస్తూ ముందుకెళ్తోంది టీవీ9. ప్రజా సమస్యలు అద్దంపట్టేలా టీవీ9 రెండు దశాబ్దాలుగా పనిచేస్తూ వస్తోంది. టీవీ9లో వార్త వచ్చిందంటే.. దానికో కచ్చితత్వం ఉంటుంది.

అందుకే.. తెలుగువారి ఫ్యాక్ట్ చెకర్‌గా టీవీ9 నిలిచి.. నమ్మకానికి మారుపేరుగా నిలిచింది. వాస్తవపూరితమైన కథనాలను.. కచ్చితత్వంతో.. వేగంగా అందిస్తూ వస్తోంది మనందరి న్యూస్ చానల్ టీవీ9 తెలుగు. అందుకే ప్రజలు టీవీ9కి పట్టం కట్టారు. ప్రజలు టీవీ9 వైపే నిలిచారు.
