దారుణంగా హత్య చేసి.. గోనెసంచిలో కుక్కి ఇంటి ముందు పడేశారు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..
హైదరాబాద్ లో ఓ వ్యక్తి పట్టపగలే దారుణ హత్యకు గురయ్యాడు. అనంతరం మృతదేహాన్ని.. ఇంటి ముందే పడేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంచలనం కలిగించింది. సమచారం అందుకున్న పోలీసులు...
హైదరాబాద్ లో ఓ వ్యక్తి పట్టపగలే దారుణ హత్యకు గురయ్యాడు. అనంతరం మృతదేహాన్ని.. ఇంటి ముందే పడేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంచలనం కలిగించింది. సమచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. చనిపోయిన వ్యక్తిని.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం వెలిమెల గ్రామానికి చెందిన సురేశ్ గా గుర్తించారు. 2016లో రేణుక అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు అక్కడే నివాసం ఉన్న వారు.. కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ కు వచ్చారు. సంజయ్ గాంధీనగర్ లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం.
రేణుక ఆదివారం భర్తను బిర్యానీ తీసుకురావాలని కోరింది. దీంతో బిర్యానీ తీసుకువచ్చేందుకు సురేశ్ బయటకు వెళ్లాడు. సమయం గడుస్తున్నా అతను ఇంటికి రాలేదు. చుట్టుపక్కలా వెతికినా లాభం లేదు. ఈ క్రమంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఇంటి ముందు గోనె సంచీలో ఏదో ఉన్నట్లు ఇంటి ఓనర్ గుర్తించాడు. దగ్గరికి వెళ్లి చూడగా అందులో సురేశ్ మృతదేహం చూసి షాక్ అయ్యాడు. విషయాన్ని పోలీసులకు తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు..అతని భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు తెలిశాయి.
కొంతకాలంగా సురేశ్ భార్య కొందరితో చనవుగా ఉంటోంది. గమనించిన సురేశ్.. ఈ విషయంపై భార్యను హెచ్చరించాడు. పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. ఈ విషయంపై ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండేవి. దీంతో ఎలాగైనా తనకు అడ్డుగా ఉన్న సురేశ్ ను అంతమొందించాలని కుట్ర పన్నింది. మరో మహిళ సహాయంతో భర్త తో కలిసి మద్యం సేవించింది. తర్వాత భర్త మెడకు చున్నీ తో ఉరి వేసి చంపేసింది. డెడ్ బాడీని గోనె సంచిలో వేసి ఇంటి ముందు పడేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసులకు కంప్లైంట్ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం