Telangana BJP: 2023 ఎన్నికలే టార్గెట్‌గా BJP యాక్షన్‌ప్లాన్.. త్వరలో 11వేల శక్తి కేంద్రాల్లో కార్నర్‌ మీటింగ్స్..

తెలంగాణ BJP దూకుడు పెంచింది. సభలు, సమావేశాలతో ప్రజల్లోకి వెళ్తోంది. అదే టైమ్‌లో జాతీయ నేతలనూ తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.! రాబోయే 8 నెలలకు యాక్షన్‌ప్లాన్ రూపొందించడమే కాదు..దాన్ని వేగంగా అమల్లో పెడుతోంది..

Telangana BJP: 2023 ఎన్నికలే టార్గెట్‌గా BJP యాక్షన్‌ప్లాన్.. త్వరలో 11వేల శక్తి కేంద్రాల్లో కార్నర్‌ మీటింగ్స్..
Telangana BJP
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 07, 2023 | 9:47 PM

2023 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ యాక్షన్‌ ప్లాన్ షురూ చేసింది. త్వరలో ప్రజాగోస.. బీజేపీ భరోసా పేరుతో 11వేల శక్తి కేంద్రాల్లో కార్నర్‌ మీటింగ్స్ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనే వక్తలకు ఇబ్రహీంపట్నంలోని మన్నెగూడలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఏయే అంశాలను జనంలోకి తీసుకెళ్లాలనే అంశాలపై ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సమావేశంలో భవిష్యత్‌లో బీజేపీ చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

ప్రజాగోస – బిజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పై వక్తలకు శిక్షణ తరగతుల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు. రోజుకు 600 బహిరంగ సభలు, 11 వేల శక్తి కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఇబ్రహీంపట్నం మన్నెగూడలోని వేద కన్వెన్షన్ లో వక్తలకు నిర్వహించిన వర్క్ షాప్‌లో బండి సంజయ్ మాట్లాడారు.

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిజేపీ గెలుపు తధ్యమన్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో జనం రాలేదని ఫీల్ కావొద్దని.. బస్తీల సమావేశాల్లో వంద మంది ఉన్నా, రెండు వందల మంది ఉన్నా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పెట్టాలన్నారు. ఏడాది కాలంలో 15 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశామన్నారు. కార్యకర్తలను నాయకులుగా తయారు చేయడమే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లక్ష్యమన్నారు. తెలంగాణ బీజేపీని సీఎం కేసీఆర్ హేళన చేశారని.. ఇబ్బంది పెట్టారని అన్నారు.

ధరణి పేరుతో నలుగురు కలెక్టర్లు అడ్డగోలుగా దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్..త్వరలోనే ఆ నివేదక బయటపెడుతామని చెప్పారు. ఓవైసీ సోదరులకు నేరుగా ఓ సవాల్‌ విసిరారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలేంటి..? అందులో నెరవేర్చినవి ఎన్ని? పాలనాపరమైన వైఫల్యాలు.. స్థానిక సమస్యలను స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లలో ప్రస్తావించనుంది బీఆర్ఎస్. ఈ 8 నెలలు కష్టపడితే.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనంటూ.. కర్యకర్తలకు దిశానిర్దేశం చేశారు నేతలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం