Telangana News: హోం వర్క్‌ చేయలేదనీ.. ఇంటర్‌ విద్యార్థులను వైర్లతో కొట్టిన ఉపాధ్యాయుడు!

క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్ధులతో కర్కశంగా వ్యవహరించారు. హోంవర్క్ చేయలేదన్న చిన్న కారణంతో విద్యార్థులపై ప్రతాపం చూపారు. కేబుల్ వైర్ తో విద్యార్ధులను చితకబాదాడు. విద్య బుద్ధులు నేర్పించాల్సిన గురువే విద్యార్థులతో కిరాతకంగా ప్రవర్తించడం పై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Telangana News: హోం వర్క్‌ చేయలేదనీ.. ఇంటర్‌ విద్యార్థులను వైర్లతో కొట్టిన ఉపాధ్యాయుడు!
Teacher Brutally Beats Inter Students

Edited By:

Updated on: Mar 11, 2026 | 10:58 AM

హత్నూర, మార్చి 11: సంగారెడ్డి జిల్లాలో గురువు అనే పదానికి కళంకం తెచ్చే ఘటన వెలుగుచూసింది. క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కర్కశంగా వ్యవహరించారు. హోంవర్క్ చేయలేదన్న చిన్న కారణంతో విద్యార్థులపై ప్రతాపం చూపారు. విద్య బుద్ధులు నేర్పించాల్సిన గురువే విద్యార్థులతో కిరాతకంగా ప్రవర్తించడం పై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తుర్కల ఖానాపూర్ లోని రత్నాపూరి ఇన్‌స్టిట్యూట్లో 15 మంది ఇంటర్ విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు ఇష్టం వచ్చినట్లు చితకబాదాడు. రత్నపురి ఇనిస్ట్యూటీ టెక్నాలజీ కళాశాలలో శివారెడ్డి అనే ఉపాధ్యాయుడు ఫస్ట్ ఇయర్ విద్యార్థులను హోం వర్క్ చేయలేదని సుమారు 15 మంది విద్యార్థులను కేబుల్ వైర్‌తో ఇష్టం వచ్చినట్లు చితకబాదాడు. ఆనక దురుసు పదజాలంతో ఉపాధ్యాయుడు శివారెడ్డి తిట్టాడంటూ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలిపారు. చితకబాదిన తర్వాత విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. వారి శరీరంపై వాతలు తేలాయి.

దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, స్థానికులు కళాశాల ఉపాధ్యాయుడి తీరును ప్రశ్నించారు. విద్యార్థుల పై దురుసుగా ప్రవర్తించిన రత్నపురి కళాశాల HOD, ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us