AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పొట్ట ఉబ్బిపోయి నొప్పితో కనిపించిన ఆవు.. ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయగా

సాధారణంగా ఆవులు గడ్డితోపాటు ఇతర ఆహార పదార్థాలను తీసుకుంటాయి. అవి జీర్ణమై పేడ రూపంలో బయటికి వస్తుంది. అయితే అనారోగ్యానికి గురైన ఆవుకు పశువైద్యులు చికిత్స చేశారు. అయినా కోల్పోకపోవడంతో పశు వైద్యులు.. ఆవుకు ఆపరేషన్ చేశారు. ఆవు కడుపులో ఉన్న వాటిని చూసి షాక్ తిన్నారు. పశువైద్యలు ఎందుకు షాక్ తిన్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే.

Telangana: పొట్ట ఉబ్బిపోయి నొప్పితో కనిపించిన ఆవు.. ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయగా
Telugu News
M Revan Reddy
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 19, 2025 | 8:45 PM

Share

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన రామలింగం అనే రైతు పాడి ఆవులతో జీవనం సాగిస్తున్నాడు. 9 ఏళ్ల ఆవు కొద్ది రోజులుగా నీరసంగా ఉంటూ అనారోగ్యానికి గురైంది. ఆ ఆవు అప్పటికే ఐదు నెలల సుడితో ఉండటం, కడుపు భారీగా వాపు ఉండటంతో రైతు రామలింగం ఆందోళన చెందాడు. రామలింగం తన ఆవును స్థానిక ప్రాంతీయ పశు వైద్యశాలకు తీసుకువచ్చారు. పశువైద్యాధికారి పెంటయ్య ఆవును పరీక్షించి.. కడుపులో భారీమొత్తంలో ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయని గుర్తించాడు. అత్యవసరంగా ఆపరేషన్ చేయకపోతే ఆవు ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ చెప్పాడు. సుడి కావడంతో ఆపరేషన్ చేస్తే చనిపోతుందని రైతు రామలింగం ఆందోళన చెందాడు. అయినా తన సిబ్బందితో పశు వైద్యాధికారి పెంటయ్య నాలుగు గంటల పైగా శ్రమించి ఆపరేషన్ చేశాడు. ఆవుకు ఆపరేషన్ చేసిన వైద్యులు మాత్రం షాక్ తిన్నారు.

ఆవు కడుపులో జీర్ణం కాని వ్యర్ధాలను భారీ మొత్తంలో బయటపడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు 90 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ప్లాస్టిక్ కవర్లు, వైర్లు, కేబుల్ వైర్లు, తాళ్ళు, ఇంకా రకరకాల తీగలు, మామిడి టెంకలు, ఇనుప తీగలు, జాలీలు, గుడ్డ పేలికలు ఇలా రకరకాల వస్తువులు ఈ వ్యర్ధాల్లో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లోని ఆవులు గడ్డి, పచ్చిమేత దొరకకపోవడంతో ప్లాస్టిక్ వ్యర్ధాలను తింటున్నాయని, ఏళ్ల తరబడి తినడంతో కడుపులో జీర్ణం కాక మిగిలిపోయాయని పశు వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా స్వచ్చంద సంస్థలు, జంతు ప్రేమికులు ముందుకు వచ్చి.. తీసుకువస్తే రోడ్లపై తిరిగే ఆవుల కడుపులోని వ్యర్ధాలను ఆపరేషన్ చేసి తొలగిస్తామని పశువైద్యాధికారి పెంటయ్య చెబుతున్నారు.

వెంకీతో ఛాన్స్.. బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన హీరోయిన్లు వీరే..
వెంకీతో ఛాన్స్.. బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన హీరోయిన్లు వీరే..
ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. భర్త..
ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. భర్త..
మెస్సీ రాక కోసం ఎయిర్ పోర్టులో వెయిట్ చేసిన వందలాది మంది ఫ్యాన్స్
మెస్సీ రాక కోసం ఎయిర్ పోర్టులో వెయిట్ చేసిన వందలాది మంది ఫ్యాన్స్
వేడి ఆహారంతో నాలుక కాలిందా? నొప్పి తగ్గించి త్వరగా నయం చేసే చిట్క
వేడి ఆహారంతో నాలుక కాలిందా? నొప్పి తగ్గించి త్వరగా నయం చేసే చిట్క
ఈ చిత్రంలో దాగి ఉన్న నెంబర్‌ను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపు
ఈ చిత్రంలో దాగి ఉన్న నెంబర్‌ను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపు
ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ప్రతి నెల రూ.12 వేల పెన్షన్‌!
ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ప్రతి నెల రూ.12 వేల పెన్షన్‌!
మెదడుకు మేత.. ఈ ప్రశ్నకు 5 సెకన్లలో సమాధానం చెప్తే.. నువ్వే తోపు!
మెదడుకు మేత.. ఈ ప్రశ్నకు 5 సెకన్లలో సమాధానం చెప్తే.. నువ్వే తోపు!
సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. రజినీ లైఫ్ స్టైల్ చూశారా.. ?
సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. రజినీ లైఫ్ స్టైల్ చూశారా.. ?
ఈ వ్యక్తులకు ఎంతదూరం ఉంటే అంత మంచిది.. లేకపోతే జీవితంలో సక్సెస్..
ఈ వ్యక్తులకు ఎంతదూరం ఉంటే అంత మంచిది.. లేకపోతే జీవితంలో సక్సెస్..
హార్దిక్ పాండ్యా, కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం?
హార్దిక్ పాండ్యా, కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం?