Telangana: అడవిలో చిక్కుకున్న 80 మంది పర్యాటకులు.. ముత్యంధార జలపాతం చూసేందుకు వెళ్లి
ములుగు జిల్లాలో 80 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. ముత్యంధార ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లిన పర్యాటకులు చిక్కుకుపోయారు. తిరిగి వస్తుండగా ఒక్కసారిగా పొంగిన వాగు. వాగు దాటలేక అడవిలోనే ఉండిపోయిన పర్యాటకులు. వీరభద్రవరంలో 15 కార్లు, 10 బైక్‌లు పార్క్ చేసి, జలపాతం సందర్శనకు వెళ్లిన పర్యాటకులు. భారీ వర్షాల కారణంగా..
ములుగు జిల్లాలో 80 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. ముత్యంధార ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లిన పర్యాటకులు చిక్కుకుపోయారు. తిరిగి వస్తుండగా ఒక్కసారిగా పొంగిన వాగు. వాగు దాటలేక అడవిలోనే ఉండిపోయిన పర్యాటకులు. వీరభద్రవరంలో 15 కార్లు, 10 బైక్‌లు పార్క్ చేసి, జలపాతం సందర్శనకు వెళ్లిన పర్యాటకులు. భారీ వర్షాల కారణంగా వాగు ఉప్పొంగి ప్రవహించడంతో పర్యాటకులు చిక్కుకుపోయారు.
ములుగు జిల్లా ఎస్పీ పర్యాటకులతో మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లో వాగు దాటే ప్రయత్నం చేయొద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. పర్యాటకులను రక్షించేందుకు రంగంలోకి SDRF, NDRF బృందాలు దిగాయి. ఇక మంత్రి సత్యవతి రాథోడ్ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి ఘటనపై ఆరా తీశారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా పర్యాటకుల లోకేషన్ అధికారులు ట్రాక్ చేశారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో వర్షం బీభత్సం కొనసాగుతోంది. కుండపోత వర్షాలతో తెలంగాణ తల్లడిల్లుతోంది. వాగులు, వంకలు ఉప్పొంగడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇక, భద్రాచలంలో అయితే గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. గంటగంటకూ నీటిమట్టం పెంచుకుంటూ భయపెడుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..