CM KCR: దూకుడు పెంచుకున్న సీఎం కేసీఆర్.. అభ్యర్థుల ప్రకటన అప్పుడే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న వేళ సీఎం కేసీఆర్ కసరత్తులు మొదలుపెట్టారు. ఆగస్టు నెలల బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కీలక నేతర చేరిక జరిగిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

CM KCR: దూకుడు పెంచుకున్న సీఎం కేసీఆర్.. అభ్యర్థుల ప్రకటన అప్పుడే
CM KCR
Follow us
Aravind B

|

Updated on: Jul 26, 2023 | 9:55 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న వేళ సీఎం కేసీఆర్ కసరత్తులు మొదలుపెట్టారు. ఆగస్టు నెలల బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కీలక నేతర చేరిక జరిగిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి విడుతలో గెలవనున్న వారి మొదటి జాబితాను విడుదల చేసేందుకు గులాబీ బాస్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

వివిధ సర్వే సంస్థలు, నిఘా సంస్థల రిపోర్టుల ఆధారంగా.. నియోజకవర్గాల వారిగా బీఆర్ఎస్, ప్రతిపక్ష బలాలు, బలహీనతలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు టాక్. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం లేని చోట ఇతరులకు టికెట్ ఇచ్చే అంశంపై కూడా దృష్టి పెట్టారు. పలు సర్వేలు.. పనితీరు ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారు. మొదటి జాబితలోనే అత్యధిక స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.