ఖైరతాబాద్ మహాగణపతి వద్ద పోకిరిల వికృత చేష్టలు.. పోలీసులు ఏం చేశారో తెలుసా..!
వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలకు హైదరాబాద్ పెట్టింది పేరు. అత్యంత నియమ, నిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఇక్కడ వినాయకచవితి వేడుకలు నిర్వహిస్తారు. ముఖ్యంగా అతి పెద్ద ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.
వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలకు హైదరాబాద్ పెట్టింది పేరు. అత్యంత నియమ, నిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఇక్కడ వినాయకచవితి వేడుకలు నిర్వహిస్తారు. ముఖ్యంగా అతి పెద్ద ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఇలా బడా గణేష్ ఉత్సవంలో కొందరు పోకిరి రెచ్చిపోయారు. దీంతో గుర్తించిన పోలీస్ నిఘా నేత్రం జైలుకు పంపించింది.
బడా గణేష్ దర్శనానికి వచ్చిన భక్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 285 మంది పోకిరిలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక వారం వ్యవధిలో వీరందరిని షీ టీమ్స్ పట్టుకుంది. స్త్రీల పట్ల అసభ్య ప్రవర్తించినందుకు పోలీసులు వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న 285 మంది పోకిరిలను పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు.
ఖైరతాబాద్ మహాగణపతి వద్ద నిత్యం భక్తుల రద్దీ ఎక్కువగా దీనికి తోడు శనివారం నుండి మొదలుకొని సోమవారం దాకా బడా గణేష్ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. చివరి నాలుగు రోజుల్లో లక్షల సంఖ్యలో భక్తులు బడా గణేష్‌ను దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో గణేష్ కోసం వచ్చే మహిళా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో పోకిరీల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మహిళా భక్తులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న పోకిరిలను పట్టుకునేందుకు 24గంటల పాటు షీ టీమ్స్ కృషి చేస్తుంది. హైదరాబాద్ గణేష్ ఉత్సవం సమయంలో మహిళల భద్రత, సురక్షితతపై దృష్టి పెట్టి పనిచేస్తుంది. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినట్లు అనిపించినా తమ దృష్టికి తీసుకురావాలని పోలీసులు మహిళా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి అసభ్య ప్రవర్తనను ఏ మాత్రం సహించవద్దు. వెంటనే షీ టీమ్స్‌కు సమాచారమివ్వండి. షీ టీమ్స్ ప్రాంతంలో తిరుగుతుంటాయి. ఎల్లప్పుడూ మహిళల భద్రత కోసం అక్కడే ఉంటున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు. మహిళల సహాయం కోసం షీ టీమ్స్ ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. అలాగే డయల్ 100 లేదా వాట్సాప్ నంబర్ 9490616555 ద్వారా సంప్రదించవచ్చని హైదరాబాద్ పోలీస్ శాఖ పేర్కొంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..