హైవేపై ఘోర ప్రమాదం.. వెనుకనుంచి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. అద్దంలో నుంచి ఎగిరి పడి..
పొగ మంచు ప్రాణాలు తీస్తోంది.. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై తాజాగా.. మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొని.. ఇద్దరు మరణించారు.. ఎదురుగా వెళ్తున్న బస్సును.. వెనుకనుంచి వస్తున్న మరో బస్సు ఢికొట్టింది.. ఈ ప్రమాదం సూర్యాపేట SV ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర చోటుచేసుకుంది..

పొగ మంచు ప్రాణాలు తీస్తోంది.. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై తాజాగా.. మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొని.. ఇద్దరు మరణించారు.. ఎదురుగా వెళ్తున్న బస్సును.. వెనుకనుంచి వస్తున్న మరో బస్సు ఢికొట్టింది.. ఈ ప్రమాదం సూర్యాపేట SV ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర చోటుచేసుకుంది.. NH65 మలుపు దగ్గర ట్రావెల్స్ బస్సులు ఢీకొట్టుకున్నాయి. యోలో ట్రావెల్స్ బస్సును.. జింగ్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది.. ప్రమాదం ధాటికి జింగ్ ట్రావెల్స్ బస్సు ఎదుట అద్దంలో నుంచి క్లీనర్ ఎగిరి బస్సు కింద పడ్డాడు.. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు.. మృతుడు క్లీనర్ సాయిగా గుర్తించారు.. అయితే.. యోలో బస్సులో కూడా మరో ప్రయాణికుడు గుండెపోటుతో మృతిచెందాడు.. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి.. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. క్షతగాత్రులను సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పొగమంచు, అతివేగం, నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. అయితే.. గుండెపోటుతో మరణించిన వ్యక్తి పేరు తెలియాల్సి ఉంది.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో తప్పిన పెను ప్రమాదం
ఏపీలో ఓ ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మన్నేటికోట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం, మన్నేటికోట అడ్డరోడ్డు దగ్గరకు రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో వారంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సులో పొగలు రావడంతో కొందరు ఒక్కసారిగా కేకలు పెట్టారు. దీంతో ప్రయాణికులంతా కూడా బస్సు దిగిపోయారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే బస్సులోని విలువైన వస్తువులు.. ప్రయాణికుల లగేజీ పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
