Telangana: అయ్యో దేవుడా.. అకస్మాత్తుగా కుప్పకూలిన డిగ్రీ విద్యార్థి.. ఆసుపత్రికి తరలిస్తుండగా..

గుండెపోటు మరణాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల కాలంలో చిన్న పిల్లలు, యువకులు.. పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది గుండెపోటు ప్రాణాలు తీస్తోంది.

Telangana: అయ్యో దేవుడా.. అకస్మాత్తుగా కుప్పకూలిన డిగ్రీ విద్యార్థి.. ఆసుపత్రికి తరలిస్తుండగా..
student dies by heart attack

Updated on: Apr 06, 2023 | 7:46 AM

గుండెపోటు మరణాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల కాలంలో చిన్న పిల్లలు, యువకులు.. పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది గుండెపోటు ప్రాణాలు తీస్తోంది. గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో.. ఎప్పుడు.. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనంటూ భయపడే పరిస్థితి వచ్చింది. తాజాగా, ఖమ్మం జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రేపల్లే వాడలో ఓ డిగ్రీ విద్యార్థి గుండెపోటుతో మరణించాడు.

రేపల్లెవాడకు చెందిన షేక్‌ ఖాసీం పాషా (19) డిగ్రీ చదవుతున్నాడు. ఖమ్మం నగరంలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. రోజూ బాగానే ఉండే ఖాసీంపాషా.. రాత్రి ఒక్కసారిగా కుప్పకూలడంతో.. బంధువులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే, అప్పటికే ఖాశీం మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బంధువులు మృతదేహాన్ని రేపల్లెవాడకు తరలించారు. ఖాసీంపాషా తండ్రి నాగులమీరా కార్పెంటర్‌గా, తల్లి మైబూబీ కూలీ పనులు చేస్తూ ఇద్దరు కుమారులను చదివిస్తున్నారు. చదువుకోసం వెళ్లిన కుమారుడు విగతజీవిగా ఇంటికి రావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us