Vikarabad: ఒక్కసారిగా ఖాతాలో వచ్చిపడ్డ రూ.18.52కోట్లు.. షాక్‌కు గురైన వ్యాపారి.. ఏం చేశాడంటే

ఆదివారం చెన్నైలోని టి.నగర్​ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన 100 మంది ఖాతాదారుల అకౌంట్లలో కోట్లలో డబ్బు వచ్చి పడిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలో కూడా అలాంటి సీనే రిపీటయ్యింది.

Vikarabad: ఒక్కసారిగా ఖాతాలో వచ్చిపడ్డ రూ.18.52కోట్లు.. షాక్‌కు గురైన వ్యాపారి.. ఏం చేశాడంటే
Vikarabad
Follow us

|

Updated on: May 30, 2022 | 12:00 PM

చెన్నై(Chennai)కి చెందిన కొంతమంది బ్యాంక్‌ ఖాతాల్లో ఆదివారం ఒక్కసారిగా కోట్ల రూపాయలు వచ్చిపడిన విషయం తెలిసిందే. ఒక్కో అకౌంట్‌లో ఒకే సారి 13 కోట్లు వచ్చిపడ్డాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా వంద మంది కస్టమర్ల ఖాతాల్లో కోట్ల రూపాయలు క్రెడిట్‌ అయ్యాయి. మెసేజ్‌ చూసుకున్న ఖాతాదారులు షాక్‌కు గురయ్యారు. అయితే చెన్నైలోనే కాదు.. వికారాబాద్‌ జిల్లాలో కూడా ఓ HDFC ఖాతాదారుని అకౌంట్లో భారీగా డబ్బు జమైంది. వ్యాపారి వెంకట్‌రెడ్డి ఖాతాలో రూ. 18.52కోట్లు  పడ్డాయి. దీంతో ఆయన వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే, బ్యాంక్ సర్వర్లలో కొత్త సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయడంతో, ఇలా జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు అతని ఖాతాను హోల్డ్‌ చేశారు. అక్కడ చెన్నైలో.. ఇక్కడ మన దగ్గర… బ్యాంకు ఖాతాల్లో కోట్లలో డబ్బులు జమ కావడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై బ్యాంకు ఖాతాదారులు ఫెడరల్ క్రైమ్ అండ్ బ్యాంక్ ఫ్రాడ్ విభాగానికి కంప్లైంట్ చేయడం వల్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  బ్యాంకు ఇంటర్నెట్ సర్వీస్‌ను హ్యాక్ చేసి ఎవరైనా నగదు బదిలీ చేసి ఉంటారనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు.

మరో లేటెస్ట్‌ న్యూస్ ఏంటంటే… పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఒక మొబైల్ షాప్ నిర్వాహకుడి ఖాతాలో కూడా భారీగా నగదు జమయింది. సుమారు ఐదు కోట్ల ఎనిమిది లక్షలు డిపాజిట్ అయ్యే సరికి… షాకయ్యాడు HDFC ఖాతాదారు ఇల్లెందుల సాయి. కానీ ఐదు గంటల్లోనే జమయిన డబ్బంతా మాయమైయ్యాయి. సాంకేతిక సమస్యే కారణమని, ఎటువంటి గడబిడా లేదని చెబుతున్నారు బ్యాంకు అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest Articles
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి