AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బాసర ట్రిపుల్ఐటీలో ఫుడ్ పాయిజన్.. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిన విద్యార్థులు

బాసర ట్రిపుల్ ఐటీలో (Basara IIIT) కలకలం రేపింది. మధ్యాహ్న భోజన సమయంలో మరోసారి ఫుడ్ పాయిజన్ అయింది. ఫ్రైడ్ రైస్ తిన్న 150మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 40 మంది పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అత్యవసర వైద్యం కోసం....

Telangana: బాసర ట్రిపుల్ఐటీలో ఫుడ్ పాయిజన్.. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిన విద్యార్థులు
Basara Iiit
Ganesh Mudavath
|

Updated on: Jul 15, 2022 | 6:58 PM

Share

బాసర ట్రిపుల్ ఐటీలో (Basara IIIT) కలకలం రేపింది. మధ్యాహ్న భోజన సమయంలో మరోసారి ఫుడ్ పాయిజన్ అయింది. ఫ్రైడ్ రైస్ తిన్న 150మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 40 మంది పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అత్యవసర వైద్యం కోసం నిజామాబాద్ కు తరలించారు. పీయూసీ-1, పీయూసీ-2 విద్యార్థుల మెస్‌ల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భోజనం తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. విద్యార్థుల పరిస్థితిని చూసి అధికారులు అప్రమత్తమయ్యారు. క్యాంపస్‌లోనే ప్రాథమిక వైద్యం అందించారు. ఫుడ్ పాయిజన్ (Food Poisoning) కు ఎఫెక్ట్ అయిన విద్యార్థుల సంఖ్య పెరగుతుండటంతో నిర్మల్‌, భైంసా నుంచి వైద్యులను రప్పించారు. కాగా.. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ఆస్పత్రిలో చేరిన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఫుడ్ ఫాయిజన్ కారణాలపై విచారణకు ఆదేశించారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డైరెక్టర్ కు స్పష్టం చేశారు.

కాగా.. గతంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వివిధ సమస్యలు పరిష్కరించాలని, రెగ్యులర్​ వీసీని నియమించాలనే డిమాండ్లతో ఆందోళన చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో భారీగా పోలీసులు మోహరించారు. స్టూడెంట్లకు మద్దతు తెలిపేందుకు వచ్చేవాళ్లను అరెస్ట్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులనూ వదిలకుండా అరెస్టులు చేశారు. విద్యార్థుల నిరసనలపై మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే విఠల్​రెడ్డి, కలెక్టర్, ఎస్పీ పలు దఫాలుగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారంపై సీఎం కేసీఆర్​గానీ, మంత్రి కేటీఆర్​గానీ లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని విద్యార్థులు పట్టుబట్టారు.

ఈ పరిస్థితుల్లో బాసర ట్రిపుల్​ఐటీ విద్యార్థులతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చలు జరిపి.. ఆందోళనలకు ముగింపు పలికారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని, త్వరలోనే రెగ్యులర్​ వీసీని నియమిస్తామని హామీ ఇచ్చారు. ల్యాప్​టాప్స్​ పంపిణీ, క్వాలిటీ ఫుడ్​ సహా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, స్టూడెంట్స్ తమ ఆందోళన విరమించి క్లాసులకు హాజరుకావాలని కోరారు. ఈ క్రమంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన జరగడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..