Nizamabad: తండ్రి సైకిల్ కొనివ్వలేదని మనస్తాపంతో.. ఆత్మహత్య చేసుకున్న బాలుడు

చిన్న చిన్న కారణాలతో చిన్నారులు సైతం.. ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ బాలుడు తండ్రి సైకిల్ కొనివ్వలేదని.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

Nizamabad: తండ్రి సైకిల్ కొనివ్వలేదని మనస్తాపంతో.. ఆత్మహత్య చేసుకున్న బాలుడు
Nizamabad Crime News
Follow us

|

Updated on: May 11, 2022 | 7:42 PM

Nizamabad: చిన్న చిన్న కారణాలకే వయసుతో సంబంధం లేకుండా అత్యంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని తమ కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని కలిగిస్తున్నారు. సెల్ ఫోన్ కొనివ్వలేదనో, టీవీ చూడనివ్వడం లేదంటూ.. రిమోట్ కోసం ఇలాంటి చిన్న చిన్న కారణాలతో చిన్నారులు సైతం.. ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనల గురించి వింటూనే ఉన్నాం.. తాజాగా నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తన తండ్రి సైకిల్ కొనివ్వలేదని మనస్తాపంతో ఓ బాలుడి ఆత్మహత్య(old boy ends life) చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని కమ్మర్పల్లి లో టేకు విజయ్ అనే బాలుడు 7 వ తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు తన  తండ్రి సతీష్ ని సైకిల్ కొనివ్వమని అడిగాడు. అయితే సతీష్ ఆర్థికస్థితి అంతంతమాత్రమే. దీంతో తన కొడుక్కి.. సైకిల్ ఇప్పుడు కొనివ్వలేను.. డబ్బులు సర్దుబాటు అయ్యాక తర్వాత కొనిస్తా అని చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన బాలుడు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం ఆడుకుంటానని చెప్పి ఇంట్లో నుండి వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ్ మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..