Telangana: దానిమ్మ తోటకు గొడుగు.. రైతు వినూత్న ఆలోచన.. ఎందుకంటే..?

తుఫాన్ కారణంగా వాతావరణం చల్లబడింది.. లేదంటే ప్రజంట్ ఎండల్లో మాడిపోతూ ఉండేవాళ్లం. ముసురు పట్టక మునుపు నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనుషులంటే ఏవో ప్రత్యామ్నాయ మార్గాలతో వేడి నుంచి సేద తీరుతున్నారు. మరి పంట పొలాల సంగతి ఏంటి..?

Telangana: దానిమ్మ తోటకు గొడుగు.. రైతు వినూత్న ఆలోచన..  ఎందుకంటే..?
Pomegranate Crop
Follow us

|

Updated on: May 12, 2022 | 7:01 PM

మండే ఎండలకు మనతో పాటు.. పంటపొలాలు కూడా మాడి మసైపోతున్నాయి. అందుకే… మీకేనా మాకూ గొడుగు పట్టండి అన్నట్లు అవి దీనంగా కనిపిస్తున్నాయి. వాటి మొర ఆలకించారో ఏమో… అక్కడి రైతులు నైలాన్‌తో గొడుగుల్లాంటివి తయారు చేసి.. వాటితో దానిమ్మ పంటను కప్పేశారు. పైన ఫోటోలో  తెల్ల మబ్బుల్లాంటి మంచు తెరలు చూశారా.? చీర కట్టిన దానిమ్మ… అంటూ ఆ దృశ్యాన్ని వింతగా చూస్తున్నారు జనం. భగభగ మండే ఎండల నుండి దానిమ్మ పంటను కాపాడ్డానికి నారాయణపేట జిల్లా( narayanpet district)కు చెందిన ఓ రైతుకొచ్చిన సరికొత్త ఆలోచన ఇది. దానిమ్మ చెట్లకు గొడుగుల్లాంటి తెరలు కుట్టి… ఇప్పుడు నా దానిమ్మ పంట సేఫ్ అని రిలాక్స్ అవుతున్నాడు. కాపు కాస్తున్న 12 ఎకరాల దానిమ్మ తోటకు గ్రీష్మ తాపం నుంచి ఇలా ఉపశమనం ఇచ్చాడా ఔత్సాహిక రైతు. ఈ క్రాప్ నెట్ తయారీకి పది లక్షలు ఖర్చయింది. అయితేనేం… ఎండకు మాడకుండా చెట్ల నుంచి నాణ్యమైన కాయలు లభిస్తాయి. ఆ కాయలకు మార్కెట్‌లో మంచి రేటు కూడా పలుకుతుంది. ఆ విధంగా తనకు పెద్ద నష్టమేమీ లేదని భరోసాగా చెబుతున్నాడు సదరు రైతు.

ఇవి కూడా చదవండి