Stray Dogs: అయ్యో ఎంత ఘోరం.. చెట్టు కింద నిద్రిస్తున్న నెలల పసికందును పీక్కుతిన్న వీధికుక్కలు!

|

Sep 11, 2024 | 11:58 AM

వీధి కుక్కలు ఓ పసికందును పీక్కుతిన్న ఘటన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో సోమవారం కలకలం రేపింది. చెట్టు కింద నిద్రపోతున్న పది నెలల చిన్నారిపై శునకాల గుంపు దాడి చేసి, దారుణంగా చంపేశాయి. బోధన్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది..

Stray Dogs: అయ్యో ఎంత ఘోరం.. చెట్టు కింద నిద్రిస్తున్న నెలల పసికందును పీక్కుతిన్న వీధికుక్కలు!
Stray Dogs
Follow us on

శక్కర్‌నగర్‌, సెప్టెంబర్‌ 11: వీధి కుక్కలు ఓ పసికందును పీక్కుతిన్న ఘటన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో సోమవారం కలకలం రేపింది. చెట్టు కింద నిద్రపోతున్న పది నెలల చిన్నారిపై శునకాల గుంపు దాడి చేసి, దారుణంగా చంపేశాయి. బోధన్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఓ మహిళ యాచిస్తూ పొట్టపోసుకుంటుంది. ఆమెకు పది నెలల కుమారుడు ఉన్నాడు. కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో సోమవారం రాత్రి నిద్ర పోతున్న బాలుడిని ఆమె ఓ చెట్టు కింద ఉంచి, పనిమీద బయటకు వెళ్లింది. కాసేపటి తర్వాత వచ్చి చూస్తే చెట్టు వద్ద కుమారుడు కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. మంగళవారం ఉదయం కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. నెల క్రితమే బోధన్‌ తట్టికోట్‌లో ఓ చిన్నారిని నోట కరుచుకుని వెళ్లిన ఉదంతం మరువక ముందే ఈ విషాదం చోటు చేసుకోవడంతో స్థానికులను భయాందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో నిత్యం ఎక్కడో ఒకచోట వీధికుక్కలు దాడి చేస్తూనే ఉంటాయి. తాజా ఘటనపై కేసు నమోదు చేసిన పట్టణ సీఐ వెంకటనారాయణ తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు.

బాలుడు అదృశ్యమైన ప్రాంతంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా.. మంగళవారం తెల్లవారుజామున కుక్కలు ఓ చిన్నపిల్లాడ్ని నోట కరచుకుని వెళ్లినట్లు ఓ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. అతడు చెప్పిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా, అక్కడక్కడ మాంసపు ముద్దలు కనిపించాయి. అవి చిన్నారి అవయవాలుగా గుర్తించి, వాటిని సేకరించి, బాలుడిని కుక్కలు చంపేసి పీక్కుతిన్నట్టు నిర్ధారించారు. అనంతరం దొరికిన మాంసం ముద్దలను బోధన్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చిన్నారిని వీధికుక్కలు పీక్కుతిన్న ఘటన వెలుగులోకి రావడంతో బోధన్‌లో కలకలం రేపింది. వీధికుక్కల బెడదతో అల్లాడిపోతున్న స్థానికులు తాజా ఘటనతో వణికిపోతున్నారు. కాగా ఇటీవల తట్టికోట్‌ ప్రాంతంలో ఓ బాలుడిని కుక్కలు మెడ పట్టుకుని ఎత్తుకెళ్తుండగా అడ్డుకున్న గర్భిణితోపాటు పలువురిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉదంతం మరిచిపోక ముందే మరో బాలుడు కుక్కలకు ఆహారంగా మారడం కలచి వేసింది. కుక్కల బెడద గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.