YouTube Music: నెట్‌ కనెక్షన్ లేకపోయినా ఆన్‌లైన్‌లో పాటలు వినొచ్చు.. య్యూట్యూబ్‌ మ్యూజిక్‌ కొత్త ఫీచర్‌ వివరాలు ఇవి..

|

Apr 02, 2024 | 1:33 PM

యూట్యూబ్‌ మ్యూజిక్‌ ప్లాట్‌ఫారంను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదేంటంటే ఆఫ్‌లైన్‌ మ్యూజిక్‌ ఫీచర్‌. మీకు ఇంటర్‌నెట్‌ కనెక‌్షన్‌ లేకపోయినా మీకిష్టమైన పాటలను వినే వెసులుబాటు కల్పిస్తుంది. ఈ ఫీచర్‌ ఇప్పటికే యూబ్యూట్‌ మ్యూజిక్‌ మొబైల్‌ యాప్‌( ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌)లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫీచర్‌ను డెస్క్‌టాప్‌ వెర్షన్‌కి కూడా అందుబాటులోకి తెచ్చింది.

YouTube Music: నెట్‌ కనెక్షన్ లేకపోయినా ఆన్‌లైన్‌లో పాటలు వినొచ్చు.. య్యూట్యూబ్‌ మ్యూజిక్‌ కొత్త ఫీచర్‌ వివరాలు ఇవి..
Youtube Music
Follow us on

ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ ఫారంనకు యూట్యూబ్‌ ప్రసిద్ధి. వీడియో స్ట్రీమింగ్‌లో మరే ఇతర వేదిక యూట్యూబ్‌నకు పోటీ ఇచ్చే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. అయితే కేవలం వీడియోలు మాత్రమే కాక.. ఇటీవల మ్యూజిక్‌ పై కూడా యూట్యూబ్‌ ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో తన యూట్యూబ్‌ మ్యూజిక్‌ ప్లాట్‌ఫారంలో కొన్ని మార్పులు చేయడంతో పాటు వినియోగదారులకు అవసరమైన కొన్ని ఫీచర్లను తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ యూట్యూబ్‌ మ్యూజిక్‌ ప్లాట్‌ఫారంను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదేంటంటే ఆఫ్‌లైన్‌ మ్యూజిక్‌ ఫీచర్‌. మీకు ఇంటర్‌నెట్‌ కనెక‌్షన్‌ లేకపోయినా మీకిష్టమైన పాటలను వినే వెసులుబాటు కల్పిస్తుంది. ఈ ఫీచర్‌ ఇప్పటికే యూబ్యూట్‌ మ్యూజిక్‌ మొబైల్‌ యాప్‌( ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌)లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫీచర్‌ను డెస్క్‌టాప్‌ వెర్షన్‌కి కూడా అందుబాటులోకి తెచ్చింది.

పరీక్షలు ఇలా..

యూట్యూబ్ ఈ ఫీచర్‌ని మొదటిగా డెస్క్‌టాప్‌లలో కొంతమంది వినియోగదారులతో పరీక్షించింది. అయితే ఈ ఫీచర్ ఇప్పుడు విస్తృత లభ్యతను పొందినట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో యూట్యూబ్ మ్యూజిక్ వినియోగదారులందరికీ ఆఫ్‌లైన్ లిజనింగ్ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. పరీక్ష దశలో భాగమైన వినియోగదారులకు వారి లైబ్రరీ ట్యాబ్ పక్కన, ‘న్యూ! డౌన్‌లోడ్‌ మ్యూజిక్‌ టు లిజన్‌ ఆఫ్‌లైన్‌’ పేరిట ఓ నోటిఫికేషన్‌ కనిపిస్తుంది. మీరు కూడా అలాంటి సందేశాన్ని స్వీకరించినట్లయితే, యూట్యూబ్‌ మ్యూజిక్‌ డెస్క్‌టాప్ యాప్‌లో ఆఫ్‌లైన్‌లో వినడం కోసం మీకు ఇష్టమైన పాటలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూ ట్యూబ్‌ మ్యూజిక్‌ డెస్క్‌టాప్ వెబ్ యాప్‌లో ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌లకు పరిమితి ఉంది. 10-పరికరాల డౌన్‌లోడ్ పరిమితి ఉంది. అంతేకాక డెస్క్‌టాప్ వినియోగదారులు మొబైల్ యాప్ మాదిరిగానే కనీసం 30 రోజులకు ఒకసారి తమ పరికరాన్ని ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయకుంటే ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌లు ఎక్స్‌పైర్‌ అవుతాయి.

యూట్యూబ్ మ్యూజిక్ డెస్క్‌టాప్ యాప్‌లో పాటలను డౌన్‌లోడ్ ఇలా..

ఎలాంటి ఇంటర్నెట్ లేకుండా యూట్యూబ్‌ మ్యూజిక్‌ వెబ్‌సైట్‌లో సంగీతాన్ని సేవ్ చేయడానికి దిగువ దశల వారీ గైడ్‌ని అనుసరించండి:

ఇవి కూడా చదవండి
  • మీ డెస్క్‌టాప్‌లో యూట్యూబ్‌ మ్యూజిక్‌ వెబ్ యాప్‌ను తెరవండి.
  • తర్వాత, ఆల్బమ్ లేదా సింగిల్ పేజీకి వెళ్లండి.
  • మూడు డాట్‌లు కలిగిన ఆప్షన్ల బటన్‌పై క్లిక్‌ చేసి డ్రాప్‌ డౌన్‌ మెనూ నుంచి ‘సేవ్‌ టు లైబ్రెరీ’పై క్లిక్‌ చేయండి.
  • ఇప్పుడు, మీ డెస్క్‌టాప్‌లో ఆల్బమ్ లేదా సింగిల్‌ను సేవ్ చేయడానికి డౌన్‌లోడ్ ఎంపికపై క్లిక్ చేయండి.

యూట్యూబ్‌ మొబైల్ యాప్ లాగానే, మీరు వెబ్‌లో డౌన్‌లోడ్ చేసే అన్ని పాటలు వినియోగదారు లైబ్రరీలోని “డౌన్‌లోడ్‌లు” ట్యాబ్‌లో కనిపిస్తాయి. వెబ్ యాప్ అనుకూలమైన ఫిల్టర్‌లను కూడా కలిగి ఉంటుంది, ఇది వినియోగదారులను ఆల్బమ్‌లు, ప్లేజాబితాలు, పాడ్‌క్యాస్ట్‌లు లేదా పాటల వారీగా క్రమబద్ధీకరించడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌, ఒపెరా బ్రౌజర్‌లలో పనిచేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..