Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphone: మీ ఫోన్‌లో ఆ యాప్స్ ఉంటే మీ సొమ్ము హాంఫట్.. వారికి ప్రమాద హెచ్చరిక

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం అనేది ప్రతి ఒక్కరికీ సాధారణ విషయంగా మారింది. ప్రతి చిన్న విషయానికి స్మార్ట్ ఫోన్‌పై ఆధారపడేవారు చాలా మంది ఉన్నారు. ఇటీవల కాలంలో పెట్టుబడులకు కూడా స్మార్ట్ ఫోన్ యాప్స్ వినియోగిస్తున్నారు. అయితే ఇదే కొంపముంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కొన్ని నకిలీ వ్యాలెట్ల ద్వారా పెట్టుబడిదారుల సొమ్ము తస్కరించే యాప్స్ ఎక్కువయ్యాయని పలు నివేదికల్లో తేలింది.

Smartphone: మీ ఫోన్‌లో ఆ యాప్స్ ఉంటే మీ సొమ్ము హాంఫట్.. వారికి ప్రమాద హెచ్చరిక
Fake Apps
Follow us
Srinu

|

Updated on: Jun 11, 2025 | 9:43 PM

స్మార్ట్‌ఫోన్‌లలో ప్రమాదకరమైన యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా క్రిప్టో వాలెట్‌లను ఉపయోగించే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ యాప్‌లు నిజమైన క్రిప్టో వాలెట్ యాప్‌ల మాదిరిగానే ఉంటాయి కానీ అవి నకిలీవని చెబుతున్నారు. ఇటీవల వెల్లడైన నివేదిక ప్రకారం అవి మీ సమాచారాన్ని తస్కరించేందుకే ఈ వ్యాలెట్ పని చేస్తుందని స్పష్టమైంది. ముఖ్యంగా ఒరిజినల్ యాప్‌ల లోగోలు/పేర్లను కాపీ చేసి మరీ గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రవేశిస్తున్నారని పేర్కొంటున్నారు. మీరు ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వారు ఫిషింగ్ వెబ్‌సైట్ లేదా నకిలీ స్క్రీన్‌ను తెరిచి పాస్‌వర్డ్స్ వంటి సున్నిత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఫోర్బ్స్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా క్రిప్టో పెట్టుబడిదారుల నుంచి మినోమిక్ ఫేజ్(జ్ఞాపకశక్తి పదబంధం) సేకరిస్తున్నారని హెచ్చరించింది.

మినోమిక్ ఫేజ్(జ్ఞాపకశక్తి పదబంధం) ఒక రహస్య కోడ్ లాంటిది. ఈ కోడ్ ద్వారా ఎవరైనా మీ క్రిప్టో మొత్తాన్ని దొంగిలించవచ్చు. ఈ క్రిప్టో కరెన్సీ నకిలీ యాప్స్ ఇప్పటికే 20 కి పైగా కనుగొన్నారు. ముఖ్యంగా పాన్‌కేక్ స్వాప్, సూయట్ వాలెట్, హైపర్‌లిక్విడ్, రేడియం, బుల్‌ఎక్స్ క్రిప్టో, ఓపెన్ ఓషన్ ఎక్స్ఛేంజ్, మెటియోరా ఎక్స్ఛేంజ్, సుషీస్వాప్ మరియు హార్వెస్ట్ ఫైనాన్స్ బ్లాగ్ వంటి పేర్లతో ఉండే యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ యాప్‌లు వేర్వేరు డెవలపర్‌ల నుండి వచ్చినట్లు కనిపిస్తున్నాయి కానీ అవి ఒకే రకమైన యాప్ వివరణలు, సారూప్య ప్యాకేజీ పేర్లు, వారి గోప్యతా విధానాలలో కమాండ్ కంట్రోల్ లింక్‌లను హైడ్ చేయడం వంటివి చేయడం గమనార్హం. చాలా మంది యూజర్లు వీటిని సాధారణ యాప్‌లుగా భావించి హ్యాకర్లకు బలయ్యారని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. 

అయితే ఈ యాప్‌లను ఒక్కొక్కటిగా కనుగొని గూగుల్‌కు నివేదిస్తుననారు. దీంతో చాలా ఫేక్ యాప్స్‌ను ఇప్పటికే ప్లే స్టోర్ నుంచి తొలగించారు. సిబిల్ నివేదిక ప్రకారం ఇప్పటికే ప్లే స్టోర్ నుంచి తొలగించిన యాప్స్ మీ ఫోన్స్‌లో ఉంటే వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలని హెచ్చరికలు సైతం జారీ చేసిందని పేర్కొన్నారు. ముఖ్యంగా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు ఎంత మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారో? చూడాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఫేక్ యాప్‌లు 50 కంటే ఎక్కువ నకిలీ వెబ్‌సైట్‌లతో భారీ ఫిషింగ్ నెట్‌వర్క్‌ను ఉపయోగించాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా యూజర్లు జాగ్రత్తగా ఉంటేనే ఇలాంటి మోసాల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?