Smartphone: స్మార్ట్‌ఫోన్స్ విడుదలలో మోటో దూకుడు.. మరో కొత్త ఫోన్ లాంచ్.!
భారతదేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ రోజురోజుకూ విస్తరిస్తుంది. ముఖ్యంగా దేశంలోని మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు ఉండే ఫోన్లను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా కాలంలో మోటరోలా కొత్త ఫోన్స్‌ను బడ్జెట్ ధరల్లోనే లాంచ్ చేస్తుంది. తాజాగా ఆ కంపెనీ ఎడ్జ్ 60 పేరుతో సరికొత్త ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మోటరోలా భారతదేశంలో తన కొత్త మిడ్ రేంజ్ ఫోన్ ఎడ్జ్ 60ను ఇటీవల లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో ఆవిష్కరించిన ఎడ్జ్ ఫోన్‌ల మాదిరిగానే డిజైన్‌తోనే వస్తుంది. మోటరోలా ఎడ్జ్ 60 రూ.30,000 కంటే తక్కువ ధరతో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ఐక్యూ నియో 10ఆర్, ఇన్ఫినిక్స్ జీటీ 30 ప్రో, పోకో ఎక్స్7 ప్రో మరియు వన్‌ప్లస్ నార్డ్ 4 వంటి మోడల్స్‌కు గట్టి పోటినిస్తుందని చెబుతున్నారు. మోటరోలా ఎడ్జ్ 60 12 జీబీ+ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999గా ఉంటుంది. ఈ ఫోన్ జూన్ 17 నుండి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా అఫిషియల్ వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
మోటరోలా ఎడ్జ్60 ఫోన్ వెనుక భాగంలో వీగన్ లెదర్ ఫినిషింగ్‌తో వస్తుంది. అలాగే పాంటోన్ జిబ్రాల్టర్ సీ, పాంటోన్ షామ్‌రాక్ అనే రెండు రంగుల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. మోటరోలా ఎడ్జ్ 60లో 6.67 అంగుళాల 1.5కే 10 బిట్ పీఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ ఫోన్ నీరు, ధూళి నిరోధకత కోసం ఐపీ68, ఐపీ 69 రేటింగ్‌తో పాటు ఎంఐఎల్-ఎస్టీడీ-810హెచ్ మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్‌తో వస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 60 ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ మాలీ-జీ615 ఎంసీ2 జీపీయూతో వస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1 టీబీ వరకు విస్తరించే అవకాశం ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే ఎడ్జ్ 60లో ఓఐఎస్‌తో 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీఐఏ 700సీ ప్రైమరీ సెన్సార్, 50 ఎంపీ ఆటో-ఫోకస్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 10 ఎంపీ 3 ఎక్స్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో ఈ ఫోన్ 30 ఎఫ్‌పీఎస్ వద్ద 4కే వరకు రికార్డ్ చేసేలా 50 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఆకట్టుకుంటుంది. ఎడ్జ్ 60 మోటరోలాకు సంబంధించిన హలో యూఐ ఆధారిత ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది. మూడు సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్స్‌తో పాటు నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది. అలాగే ఈ ఫోన్ 68 వాట్స్ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చేలా 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఆకట్టుకుంటుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి