Lightyear 0: ప్రపంచంలోనే తొలి సొలార్ కార్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే, ధరెంతో తెలుసా?
Lightyear 0: ప్రస్తుతం విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వాలు సైతం పర్యావరణ పరిరక్షణ విషయమై ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలోనే..
Lightyear 0: ప్రస్తుతం విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వాలు సైతం పర్యావరణ పరిరక్షణ విషయమై ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలోనే బడా కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగంలో అడుగుపెట్టాయి. అయితే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలను ఛార్జింగ్ చేసుకుంటేనే నడిచే పరిస్థితి ఉంది. అయితే ఇకపై అలాంటి అవసరం లేకుండా సోలార్ ఆధారంగా నడిచే వాహనాలు ఇకపై అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా ఇప్పటికే తొలి అడుగుపడింది. లైట్ ఇయర్ 0 పేరుతో ఎలక్ట్రిక్ కారును రూపొందించారు. ఈ కారులో ఉన్న ఫీచర్లు ఏంటి.? ధర ఎంత లాంటి విషయాలు మీకోసం..
నెదర్లాండ్‌కు చెందిన లైట్ ఇయర్ అనే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ లైట్ ఇయర్ 0 కారును లాంచ్ చేసింది. ప్రపంచంలోనే సోలర్ పవర్‌తో నడిచే తొలి కారుగా ఇది పేరు తెక్చుకుంది. సూర్యకాంతిని ఉపయోగించి కారులో ఉన్న బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా కారు పైభాగంలో సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న సమయంలోనే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఈ కారులో బ్యాటరీ ఒక్కసారి ఫుల్ చార్జ్ అయితే ఏకంగా 625 కి.మీల దూరం వెళ్లొచ్చు. కేవలం సోలార్ మాత్రమే కాకుండా ప్లగ్ చార్జింగ్ ద్వారా కూడా చార్జ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
హైవేపై ప్రయాణించే ప్రతీ 100 కిలోమీటర్లకు 10.5kwh మాత్రమే వినియోగించుకోవడం ఈ కారు ప్రత్యేకగా చెప్పొచ్చు. ఇక కారు ఇంటీరియర్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నావిగేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 10.1 ఇంచెస్ టచ్ స్క్రీన్‌ను అందించారు. ఈ కారు ప్రారంభ ధర రూ. 2.05 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక కారు ప్రీ ఆర్డర్‌లను ఈ ఏడాది చివరిలో ప్రారంభంకానున్నాయి. అయితే భారత్‌లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..