Poco Pods: వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ రిలీజ్ చేసిన పోకో.. ఒక్కసారి చార్జ్ చేస్తే ముప్పై గంటల నాన్ స్టాప్ వర్కింగ్..
వైర్ లేకుండా స్మార్ట్ ఫిట్ అవ్వడంతో యువత ఎక్కువగా వీటిని ఇష్టపడుతున్నారు. ఇయర్ పాడ్స్ డిమాండ్ విపరీతంగా పెరగడంతో అన్ని కంపెనీలు వీటి తయారీకి ముందుకు వస్తున్నాయి. తాజాగా పోకో కంపెనీ సూపర్ స్మార్ట్ పాడ్స్‌ను రిలీజ్ చేసింది. ప్రతి భారతీయుడిని ప్రీమియం టెక్నాలజీతో సాధికారత కల్పించాలనే దృక్పథంతో పోకో పాడ్స్‌ను ప్రారంభిస్తున్నామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

భారతదేశంలో స్మార్ట్ యాక్ససరీస్ వినియోగం విపరీతంగా పెరిగింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో క్రమేపి స్మార్ట్ యాక్ససరీస్ వినియోగం కూడా పెరిగింది. ముఖ్యంగా వైర్డ్ ఇయర్ ఫోన్స్ స్థానంలో బ్లూటూత్ సాయంతో పని చేసే ఇయర్ బడ్స్ వచ్చాయి. వైర్ లేకుండా స్మార్ట్ ఫిట్ అవ్వడంతో యువత ఎక్కువగా వీటిని ఇష్టపడుతున్నారు. ఇయర్ పాడ్స్ డిమాండ్ విపరీతంగా పెరగడంతో అన్ని కంపెనీలు వీటి తయారీకి ముందుకు వస్తున్నాయి. తాజాగా పోకో కంపెనీ సూపర్ స్మార్ట్ పాడ్స్‌ను రిలీజ్ చేసింది. ప్రతి భారతీయుడిని ప్రీమియం టెక్నాలజీతో సాధికారత కల్పించాలనే దృక్పథంతో పోకో పాడ్స్‌ను ప్రారంభిస్తున్నామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. పోకో పాడ్‌లు అతుకులు లేని కనెక్టివిటీ, మెరుగైన ఆడియో పనితీరుకు సంబంధించి కచ్చితమైన కలయికగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ పోకో ఇయర్ పాడ్స్ రూ.1199కు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ పోకో ఇయర్ పాడ్స్ స్పెసిఫికేషన్ల వివరాల గురించి ఓ సారి తెలుసుకుందాం.
పోకో పాడ్స్ టీడబ్ల్యూఎస్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో వస్తాయి. అలాగే 60 ఎంఎస్ తక్కువ-లేటెన్సీ గేమింగ్ మోడ్, 440 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీఎక్స్ 4 రేటింగ్‌తో సహా అనేక ఫీచర్లు ఈ ఇయర్ పాడ్స్ సొంతం. ఈ ఇయర్‌బడ్స్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్, పేటీఎం వ్యాలెట్ ద్వారా డిస్కౌంట్‌లను పొందవచ్చు.
ఈ పాడ్స్ గూగుల్ ఫాస్ట్ పెయిర్‌తో వస్తాయి. అలాగే ప్రొఫెషనల్-లెవల్ బాస్ కోసం 12 ఎంఎం డ్రైవర్‌లను, లీనమయ్యే సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంది. ఇయర్‌పాడ్స్లో టచ్ నియంత్రణలు మ్యూజిక్ ప్లేబ్యాక్, కాల్ ఆన్సర్ చేయడం, వాయిస్ అసిస్టెంట్ యాక్టివేషన్ (సిరి లేదా గూగుల్ వాయిస్) వంటి అధునాత ఫీచర్లు ఉన్నాయి. ఈ ఇయర్ పాడ్స్ 5 గంటల వరకు ప్లేబ్యాక్‌ను అందిస్తాయి. అయితే 440 ఎంఏహెచ్ ఛార్జింగ్ కేస్ 30 గంటల బ్యాకప్ పవర్‌ను అందిస్తుంది. కేవలం పది నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 90 నిమిషాల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అనుమతిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..