Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus 12: లీకైన కెమెరా స్పెసిఫికేషన్లు.. వన్ ప్లస్ నుంచి కొత్త ఫోన్ క్లిక్ కొడితే మామూలుగా ఉండదు.. లాంచింగ్ ఎప్పుడంటే..

త్వరలోనే వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయాలని భావిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో గ్రాండ్ గా గ్లోబల్ వైడ్ ఈ స్మార్ట్ ఫోన్ తీసుకురావాలని ప్రణాళిక చేసింది. అయితే లాంచింగ్ కు ఇంకా చాలా నెలల సమయం ఉండగానే ఇప్పుడు వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన కీలకమైన కెమెరా స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. 5జీ వేరియంట్లో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని, 50 మెగా పిక్సల్ తో ప్రైమరీ కెమెరా వస్తుందని తెలుస్తోంది.

OnePlus 12: లీకైన కెమెరా స్పెసిఫికేషన్లు.. వన్ ప్లస్ నుంచి కొత్త ఫోన్ క్లిక్ కొడితే మామూలుగా ఉండదు.. లాంచింగ్ ఎప్పుడంటే..
Oneplus 11 5g
Follow us
Madhu

|

Updated on: Aug 01, 2023 | 6:00 PM

వన్ ప్లస్.. తక్కువ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న బ్రాండ్. కరోనా ముందు వరకూ యాపిల్ ఐఫోన్, శామ్స్ంగ్ వంటి టాప్ బ్రాండ్లకు ఏ మాత్రం తీసిపోకుండా నిలిచిన వన్ ప్లస్ కరోనా అనంతర పరిణామాల్లో కాస్త వెనుకబడిందని చెప్పాలి. అయితే ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొత్త ఉత్పత్తిని వినియోగదారులకు పరిచయం చేయబోతోంది. త్వరలోనే వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయాలని భావిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో గ్రాండ్ గా గ్లోబల్ వైడ్ గా ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ తీసుకురావాలని ప్రణాళిక చేసింది. అయితే లాంచింగ్ కు ఇంకా చాలా నెలల సమయం ఉండగానే ఇప్పుడు వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన కీలకమైన కెమెరా స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. 5జీ వేరియంట్లో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని, 50 మెగా పిక్సల్ రిజల్యూషన్ తో వస్తుందని తెలుస్తోంది. అంతేకాక దీనిలో స్నాప్ డ్రాగన్ 8 జెన్ ఎస్ఓసీ ఆధారంగా పనిచేస్తుందని, 100 వాట్ల వైర్డ్ చార్జింగ్, 50 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ కు మద్దతిచ్చే 5,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎవరు లీక్ చేశారంటే..

ప్రసిద్ధ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వీబోలో వన్ ప్లస్ 12 కెమెరా స్పెసిఫికేషన్లను లీక్ చేసింది. టిప్ స్టర్ చెబుతున్న దాని ప్రకారం ఈ హ్యాండ్‌సెట్‌లో హాసెల్‌బ్లాడ్ బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 9ఎక్స్ఎక్స్ 1/1.4-అంగుళాల ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 64 మెగాపిక్సెల్ ఓమ్‌నిపిసియల్ కెమెరా ఉంటుంది. 3రెట్ల ఆప్టికల్ జూమ్‌తో ఓవీ64బీ పెరిస్కోప్ కెమెరా ఉంటుంది. లీకైన స్పెసిఫికేషన్ల ప్రకారం, వన్ ప్లస్ 12 లో కెమెరా సెటప్ వన్ ప్లస్ 11 5జీ కంటే కొంచెం ఎక్కువ క్వాలిటీతో ఉంటుంది. వన్ ప్లస్ 11 5జీ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 50-మెగాపిక్సెల్ 1/1.56-అంగుళాల సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్, 0.5-అంగుళాల సోనీ ఐఎంఎక్స్581 సెన్సార్‌తో కూడిన 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 32ఎంపీ టెలిఫోటో కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను ప్యాక్ చేస్తుంది.

వన్ ప్లస్ 12కి సంబంధించి ఇటీవలి లీక్ స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే.. ఇది పైన ఆక్సిజన్‌ఓఎస్ 14తో ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. రాబోయే హ్యాండ్‌సెట్ 2కే రిజల్యూషన్,120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫ్లూయిడ్ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 వన్ ప్లస్ 12 కలిగి ఉంటుంది. ఇది16 జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తోంది.

ఇవి కూడా చదవండి

సెల్ఫీల కోసం, ఫోన్ ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెన్సార్‌ను అమర్చినట్లు చెబుతున్నారు. డిస్ప్లేపై హోల్ పంచ్ కటౌట్‌లో అమర్చబడి ఉంటుంది. ఇది అథెంటికేషన్ కోసం అలర్ట్ స్లైడర్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని కలిగి ఉంటుందని చెబుతున్నారు. హ్యాండ్‌సెట్ 5,400ఎంఏహెచ బ్యాటరీని కలిగి ఉంది. వేగవంతమైన 100వాట్ల వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, 50వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కలిగి ఉంటుందని లీక్ అయిన స్పెసిఫికేషన్ల బట్టి తెలుస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో