Top Upcoming Smartphones: ఎదురుచూపులకు చెల్లు.. ఆగస్టులో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. ఓ లుక్కేయండి..

ఈ ఆగస్టు నెలలో చాలా టెక్ గ్యాడ్జెట్లు లాంచింగ్ కు రెడీ అయ్యాయి. వాటి కోసం టెక్ ప్రియులను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు పెద్ద ఎత్తున ఈ నెలలో మార్కెట్లోకి రానున్నాయి. వాటిల్లో వివో వీ29 నుంచి రెడ్ మీ 12 5జీ వరకూ చాలా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. జియోమీ మిక్స్ ఫోల్డ్ 3, రియల్ మీ జీటీ5, ఇన్ ఫినిక్స్ జీటీ 10 ప్రో, రెడ్ మీ 12 5జీ, వన్ ప్లస్ ఓపెన్ వంటి స్మార్ట్ ఫోన్లు ఆ జాబితాలో ఉన్నాయి.

Top Upcoming Smartphones: ఎదురుచూపులకు చెల్లు.. ఆగస్టులో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. ఓ లుక్కేయండి..
Xiaomi Mix Fold 3
Follow us
Madhu

|

Updated on: Aug 01, 2023 | 5:30 PM

ఆగస్టులో అడుగుపెట్టాం.. 2023వ సంవత్సరంలో అప్పుడే ఏడు నెలలు గడిచిపోయాయి. ఈ ఎనిమిదో నెలలో చాలా టెక్ గ్యాడ్జెట్లు లాంచింగ్ కు రెడీ అయ్యాయి. అందుకే టెక్ ప్రియులను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు పెద్ద ఎత్తున ఈ నెలలో మార్కెట్లోకి రానున్నాయి. వాటిల్లో వివో వీ29 నుంచి రెడ్ మీ 12 5జీ వరకూ చాలా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. జియోమీ మిక్స్ ఫోల్డ్ 3, రియల్ మీ జీటీ5, ఇన్ ఫినిక్స్ జీటీ 10 ప్రో, రెడ్ మీ 12 5జీ, వన్ ప్లస్ ఓపెన్ వంటి టాప్ స్మార్ట్ ఫోన్లు ఈ ఆగస్టులో లాంచ్ కానున్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

జియోమీ మిక్స్ ఫోల్డ్ 3 .. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ఫోన్ కి పోటీగా జియోమీ మిక్స్ ఫోల్డ్ 3 తీసుకొస్తున్నట్లు కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ బ్రాండ్ లైకాతో కలిసి అభివృద్ధి చేయబడిన దాని కెమెరా సిస్టమ్ దీనిలో ప్రత్యేక ఆకర్షణగా చెబుతున్నారు. ఫోల్డబుల్ వేరియంట్లో ఇది తన ప్రత్యేకత చాటుకుంటుందని అంచనా వేస్తున్నారు. శామ్సంగ్ ఫోల్డ్ 5 కన్నా తక్కువ ధరకే లభిస్తుందని చెబుతున్నారు.

వివో వీ29 సిరీస్.. ఈ సిరీస్ లో రెండు ఫోన్లు ఉన్నాయి. వివో వీ29, వివో వీ29 ప్రో మోడళ్లు లాంచ్ కానున్నాయి. ఈ మోడల్‌లు వివో ఎస్17 సిరీస్‌కి రీబ్రాండెడ్ వెర్షన్ గా రానున్నాయి. ఇవి అధిక పనితీరుతో పాటు అత్యాధునిక ఫీచర్లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

రియల్ మీ జీటీ 5.. మీడియా నివేదికల ప్రకారం రియల్ మీ తన మొదటి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 2023ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. దాని పేరు రియల్ మీ జీటీ5. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్ సెట్ ఉంటుంది. 144హెర్జ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. వెనుకవైపు ఆకట్టుకునే 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంటుంది.

ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో.. ఈ సిరీస్ లో ఫోన్లను ఆగస్టు మూడో తేదీని తీసుకురానుంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో, ఈ స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 8050 చిప్‌సెట్‌తో వస్తుంది. దీనిలో 108ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ ఉంటుంది.

రెడ్ మీ 12 5జీ.. ఇది ఆగస్టు ఒకటినే భారతదేశంలో లాంచ్ కానున్నట్లు జియోమీ ప్రకటించింది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్, 90హెర్జ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అధిక-రిజల్యూషన్ కలిగిన 50 ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

వన్ ప్లస్ ఓపెన్.. మీడియా నివేదికల ప్రకారం వన్ ప్లస్ తన సొంత ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. దాని పేరు వన్ ప్లస్ ఓపెన్. దీనిలో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ, 2కే అమోల్డ్ ప్రైమరీ డిస్ ప్లే ఉంటుంది. దీనిలో ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంటుంది. ఆగస్ట్ 29న న్యూయార్క్‌లో జరిగే కార్యక్రమంలో గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..