AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poco C51: రూ. 5,999కే 4జీబీ ర్యామ్.. పోకో-ఎయిర్‌టెల్ కాంబోలో కొత్త ఫోన్ మామూలుగా లేదుగా..

ఈ స్మార్ట్ ఫోన్ లో మీడియా టెక్ హీలియో జీ36 చిప్ సెట్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. 4జీబీ ర్యామ్, 3జీబీ వర్చువల్ గా పెంచుకోవచ్చు. అంటే మొత్తంగా 7జీబీ ర్యామ్ అందుబాటులో ఉంటుంది. 6.52 అంగుళాల డిస్ ప్లేతో ఇది వస్తుంది.

Poco C51: రూ. 5,999కే 4జీబీ ర్యామ్.. పోకో-ఎయిర్‌టెల్ కాంబోలో కొత్త ఫోన్ మామూలుగా లేదుగా..
Poco C51
Madhu
| Edited By: |

Updated on: Jul 17, 2023 | 10:15 AM

Share

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ జియోమీకి సబ్ బ్రాండ్ అయిన పోకో మరో కొత్త 4జీ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసింది. చవకైన ధరలోనే.. ప్రముఖ టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్ టెల్ తో కలసి విడుదల చేసింది. ఈ ఫోన్ పేరు పోకో సీ51. ఇది ఎయిర్ టెల్ కనెక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ ని వినియోగదారులు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో జూలై 18 నుంచి అమ్మకానికి రానుంది. దీని ధర కేలం రూ. 5,999గా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం..

ఎయిర్ టెల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్..

ఎవరైతే ఎయిర్ టెల్ వినియోగదారులు ఈ ఫోన్ కొనుగోలు చేస్తారో వారికి 50జీబీ డేటా ఎయిర్ టెల్ డేటా ఉచితంగా లభిస్తుంది. ఒకవేళ మీరు నాన్ ఎయిర్ టెల్ వినియోగదారులైనా ఈ ఆఫర్ పొందొచ్చు. అదెలా అంటే ఫోన్ డెలివరీ అప్పుడు సిమ్ కూడా మీకు వస్తుంది. దానిని ఇన్ స్టంట్ యాక్టివేషన్ చేసుకొని ఈ ఫీచర్ పొందొచ్చు.

థ్రిల్లింగ్ గా ఉంది..

పోకో ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్ మాట్లాడుతూ పోకో, ఎయిర్ టెల్ అలియన్స్ ను ప్రకటించడానికి చాలా థ్రిల్ ఫీలవుతున్నామన్నారు. దేశ వ్యాప్తంగా ఈ పోకో సీ51ని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. అలాగే పోకో కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ప్రయోజనాలను కూడా ఎక్కువ మంది వినియోగదారులకు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే భారతీ ఎయిర్ టెల్ కస్యూమర్ బిజినెస్ డైరెక్టర్ మాట్లాడుతూ షాశ్వత్ శర్మ మాట్లాడుతూ పోకోతో తమ బంధం విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. ఈ పోకో సీ 51 ఫోన్ ని ప్రతి ఎయిర్ టెల్ కస్టమర్లు ఫ్లిప్ కార్ట్ సైట్లో కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. అలాగే ఫ్లిప్ కార్ట్ మొబైల్స్ సీనియర్ డైరెక్టర్ కునాల్ గుప్తా మాట్లాడుతూ వినియోగదారులకు చవకైన మొబైల్ ను అత్యాధునిక పీచర్లతో అందిస్తున్నామన్నారు. అదనంగా ఎయిర్ టెల్ అందించే ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు.

ఇవి కూడా చదవండి

పోకో సీ51 స్పెసిఫికేషన్లు..

ఈ స్మార్ట్ ఫోన్ లో మీడియా టెక్ హీలియో జీ36 చిప్ సెట్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. 4జీబీ ర్యామ్, 3జీబీ వర్చువల్ గా పెంచుకోవచ్చు. అంటే మొత్తంగా 7జీబీ ర్యామ్ అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.52 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. లెదర్ లీక్ డిజైన్ ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
ఎంజీ నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే
ఎంజీ నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాతాళానికి పాకిస్థాన్
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాతాళానికి పాకిస్థాన్
లారీని ఢీకొన్న కారు.. అర్ధరాత్రి కళ్లెదుటే వ్యక్తి సజీవ దహనం
లారీని ఢీకొన్న కారు.. అర్ధరాత్రి కళ్లెదుటే వ్యక్తి సజీవ దహనం