AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poco c51: భారత మార్కెట్లోకి పోకో నుంచి కొత్త ఫోన్‌.. రూ. 8500కే సూపర్ ఫీచర్స్‌.

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ ఫోన్‌ సేల్ ప్రారంభమైంది. పోకో సీ51 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో లాంచ్‌ చేశారు. రూ. 8500లో ఆకర్షణీయమైన ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌...

Poco c51: భారత మార్కెట్లోకి పోకో నుంచి కొత్త ఫోన్‌.. రూ. 8500కే సూపర్ ఫీచర్స్‌.
Poco C51
Narender Vaitla
|

Updated on: Apr 16, 2023 | 1:05 PM

Share

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ ఫోన్‌ సేల్ ప్రారంభమైంది. పోకో సీ51 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో లాంచ్‌ చేశారు. రూ. 8500లో ఆకర్షణీయమైన ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రత్యేకతలేంటి.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.52 ఇంచెస్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 గో క్లీన్ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌కు సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో టర్బో ర్యామ్ ఫీచర్‌తో మరో 3జీబీ ర్యామ్ ఉపయోగించుకోవచ్చు. మొత్తం 7జీబీ వరకు ర్యామ్ వాడుకోవచ్చు. కెమెరా విషయానికొస్తే ఇందులో 8మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఉండగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 10 వాట్‌ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఇవి కూడా చదవండి

ఇక ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499గా ఉంది. స్మార్ట్‌ఫోన్‌ సేల్ ప్రారంభమైన తొలిరోజు ఏప్రిల్‌ 10వ తేదీన రూ.7,799కే అందించారు. రాయల్‌ బ్లూ, పవర్ బ్లాక్ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను అందబాటులోకి తీసుకొచ్చారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్
RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్