Interesting Facts: ప్లాస్టిక్ స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇందులో ఇంత రహస్యం ఉందా?
Interesting Facts: ప్లాస్టిక్ కుర్చీలను తయారు చేయడానికి కరిగిన ప్లాస్టిక్‌ను పెద్ద అచ్చులలో పోస్తారు. ప్లాస్టిక్ చల్లబడి ఆకారంలోకి వచ్చిన తర్వాత, దానిని అచ్చు నుండి తీసివేయాలి. ఈ రంధ్రం లేకుండా అచ్చు నుండి కుర్చీని తొలగించడం కష్టం, విరిగిపోవడానికి కూడా దారితీస్తుంది..

Interesting Facts: కుర్చీలు మన దైనందిన జీవితంలో అంతర్భాగం. ఇంట్లో, ఆఫీసులో, పాఠశాలలో, దుకాణంలో లేదా కార్యక్రమంలో, ప్లాస్టిక్ కుర్చీ అత్యంత సాధారణ సీటింగ్ ఎంపిక. తేలికైనది, సరసమైనది, మన్నికైనది. అలాగే సులభంగా పోర్టబుల్ కావడం వల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫర్నిచర్ వస్తువులలో ఒకటి. ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైంది. ప్లాస్టిక్ వాడకం లేకుండా ఏదీ పూర్తి కావడం లేదు. అందూలోనూ ఇప్పుడు ప్లాస్టిక్ స్టూల్స్ ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇవి షాపుల్లో, ఇంట్లో, చిన్న రోడ్ సైడ్ రెస్టారెంట్స్ లో ఎక్క చూసినా ప్లాస్టిక్ స్టూల్స్ ఎక్కువగానే కనిపిస్తాయి.
అయితే, చాలా ప్లాస్టిక్ కుర్చీల వెనుక భాగంలో రంధ్రాలు ఉండటం మీరు గమనించే ఉంటారు. ఇలా రంధ్రాలు ఉండటం ఫ్యాషన్ లేదాడిజైన్ అని అనుకుంటారు. కానీ అది తప్పు. వాటికి అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Anant Ambani Watch: అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
సులభంగా విడదీయడానికి..
ప్లాస్టిక్ కుర్చీల గొప్పదనం ఏమిటంటే వాటిని ఒకదానిపై ఒకటి పేర్చవచ్చు. కానీ కుర్చీలను ఒకదానిపై ఒకటి పేర్చినప్పుడు, వాటి మధ్య గాలి చిక్కుకుపోతుంది. దీనివల్ల అవి కలిసి అతుక్కుపోతాయి వాటిని వేరు చేయడం కష్టం అవుతుంది.
స్టూల్ బలం పెంచడం కోసం:
స్టూల్ ఏ ఆకారంలో ఉన్నా కానీ.. రంధ్రం ఉండటం మాత్రం కామన్. ఓ వ్యక్తి స్టూల్ పై కుర్చున్నప్పుడు అతని బరువు ఆ స్టూల్ పై పడుతుంది. ఇలాంటప్పుడు వ్యక్తి బరువును సమానంగా నాలుగు కాళ్లపై సమానంగా ఉండటం కోసం, ఆ స్టూల్ విరిగి పోకుండా ఉండేందుకు ఆ రంధ్రం సహాయ పడుతుంది. అంతేకాకుండా కూర్చున్నప్పుడు ఒత్తిడి లేకుండా.. గాలి మొత్తం ఆ రంధ్రం ద్వారా వెళ్తుంది.
ఒక చోట నుంచి మరో ప్లేస్ కి తీసుకెళ్లేందుకు:
ఈ చిన్న రంధ్రాలు వల్ల స్టూల్స్ ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి తీసుకెళ్లేందుకు కూడా ఉపయోగ పడతాయి. రంధ్రం ఉండటం వల్ల వాటిని ఈజీగా క్యారీ చేయవచ్చు.
పెద్ద రంధ్రాలు ఉంటే త్వరగా విరిగిపోతాయి:
మరొక విషయం ఏంటంటే.. ఈ రంధ్రాలు పెద్దగా కూడా ఉండవు. కేవలం ఒక వేలు పట్టేంత ప్లేస్ వరకు మాత్రమే చిన్నగా ఉంటాయి. ఎందుకంటే రంధ్రం పెద్దగా పెడితే.. దానిపై ప్రెజర్ పడి విరిగి పోయే అవకాశం కూడా ఉంది. అందుకే చిన్న రంధ్రాలు మాత్రమే పెడతారు.
ఉత్పత్తిని సులభతరం చేయండి
ప్లాస్టిక్ కుర్చీలను తయారు చేయడానికి కరిగిన ప్లాస్టిక్‌ను పెద్ద అచ్చులలో పోస్తారు. ప్లాస్టిక్ చల్లబడి ఆకారంలోకి వచ్చిన తర్వాత, దానిని అచ్చు నుండి తీసివేయాలి. ఈ రంధ్రం లేకుండా అచ్చు నుండి కుర్చీని తొలగించడం కష్టం, విరిగిపోవడానికి కూడా దారితీస్తుంది. ఈ రంధ్రం కుర్చీని అచ్చు నుండి తీసివేయడాన్ని సులభతరం చేస్తుంది. దీని అర్థం రంధ్రం డిజైన్‌లో ఒక భాగం మాత్రమే కాదు, తయారీలో కీలకమైన అంశం కూడా.
బరువు, ఖర్చు రెండింటిలోనూ పొదుపు:
ఒక సాధారణ ప్లాస్టిక్ కుర్చీని తయారు చేయడానికి ఎంత ఎక్కువ ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తే, దాని బరువు,ఖర్చు అంత ఎక్కువగా ఉంటుంది. వెనుక భాగంలో ఒక చిన్న రంధ్రం ఉపయోగించిన మొత్తం ప్లాస్టిక్‌ను కొద్దిగా తగ్గిస్తుంది. ఈ పొదుపులు చిన్నవిగా అనిపించవచ్చు. కానీ లక్షలాది కుర్చీలను ఒకేసారి తయారు చేసినప్పుడు ఈ చిన్న వ్యత్యాసం ఉత్పత్తి ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సీటింగ్ సౌకర్యం, గాలి ప్రవాహం:
అలాగే ఈ ప్లాస్టిక్ స్టూల్స్ కాకుండా కుర్చీలపై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల తరచుగా వీపు భాగంలో చెమట పడుతుంది. దీనికి కారణం వెంటిలేషన్ లేకపోవడం. కుర్చీ వెనుక భాగంలో ఉన్న రంధ్రాలు గాలి నిరంతరం ప్రవహించడానికి వీ1693346లు కల్పిస్తాయి. దీనివల్ల సీటు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే స్టూల్స్ కాకుండా ఇతర కూర్చిలకు వెను భాగంలో రంధ్రాలు ఉంటాయి.
ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ అదే జోరు.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








