WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో ఆ ఫోన్లకు సరికొత్త ఫీచర్‌.. అదేంటంటే?

త్వరలో వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌ రానుంది. ఈ కొత్త ఫీచర్‌తో చాట్‌ల బ్యాకప్‌ను Android ఫోన్ నుంచి iOSకి ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో ఆ ఫోన్లకు సరికొత్త ఫీచర్‌.. అదేంటంటే?
Follow us

|

Updated on: Jan 22, 2022 | 9:56 AM

WhatsApp New Features: వాట్సాప్(WhatsApp) తన వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి కొత్త ఫీచర్లను విడుదల చేస్తూనే ఉంటుంది. నవంబర్ 2021 నుంచి 2022 వరకు ఎన్నో కీలక ఫీచర్లను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం యూజర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఓ ఫీచర్‌పై WhatsApp పని చేస్తోంది. ఇది ఒక విధంగా WhatsAppలో కనిపించిన అతిపెద్ద లోపంగా ఉండేది. కానీ, ఇప్పుడు దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. త్వరలో ప్రజలు ఈ అద్భుతమైన ఫీచర్‌ను పొందగలరు. ఈ మేరకు Meta ఈ ఫీచర్‌పై పనిచేస్తుందని తెలుస్తోంది.

చాట్ బ్యాకప్ ఇకపై ఈజీగా.. నివేదికల ప్రకారం, మెటా యాజమాన్యంలోని WhatsApp ఆండ్రాయిడ్ నుంచి iOSకి అనగా iPhoneకి చాట్‌లను బదిలీ చేసేందుకు ఓ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం, iOS నుంచి Samsung, Pixel ఫోన్‌లకు చాట్ బ్యాకప్‌ను బదిలీ చేసే ఫీచర్‌ను కంపెనీ విడుదల చేసింది. త్వరలో ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్‌కి కూడా ప్రారంభించనుందని వాట్సాప్ సీఈవో విల్ క్యాత్‌కార్ట్ తెలిపారు.

బీటా వెర్షన్‌పై మొదైలన టెస్టింగ్.. ప్రస్తుతానికి మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ని మార్చడం ద్వారా ఐఫోన్ (iPhone)కి మారి, WhatsAppకి లాగిన్ చేస్తే, మీకు చాట్ బ్యాకప్ లభించదు. నివేదికల ప్రకారం, ఈ ఫీచర్‌ను పరీక్షించడానికి బీటా వెర్షన్ ఆండ్రాయిడ్ 2.21.20.11 విడుదల చేసింది. ఇందులో ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చాట్ హిస్టరీని బ్యాకప్ చేసుకునే ఆప్షన్ కనిపించింది. టెస్టింగ్ విజయవంతం అయిన తర్వాత, త్వరలో అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Also Read: Twitter Video: ట్విట్ట‌ర్‌లో వ‌చ్చే వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియ‌ట్లేదా.? ఈ స్టెప్స్ ఫాలో అయితే స‌రి..

Vodafone idea: వొడాఫోన్‌ ఐడియా నుంచి వినియోగదారులు ఎందుకు వెళ్లిపోతున్నారు..? కారణం ఏమిటి..?

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..