WhatsApp: వాట్సాప్‌లో పొరపాటున కూడా ఈ పని చేయకండి.. 18.05 లక్షల అకౌంట్స్‌ మాయం..!

WhatsApp Accounts Ban: నిబంధనల ఉల్లంఘన కారణంగా మార్చిలో 18.05 లక్షల భారతీయుల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్ చేసింది వాట్సాప్ యాజమాన్యం. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్..

WhatsApp: వాట్సాప్‌లో పొరపాటున కూడా ఈ పని చేయకండి.. 18.05 లక్షల అకౌంట్స్‌ మాయం..!
Whatsapp
Follow us

|

Updated on: May 03, 2022 | 6:30 AM

WhatsApp Accounts Ban: నిబంధనల ఉల్లంఘన కారణంగా మార్చిలో 18.05 లక్షల భారతీయుల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్ చేసింది వాట్సాప్ యాజమాన్యం. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ ప్రచురించిన నెలవారీ నివేదిక ప్రకారం.. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఖాతాలు చట్టం, నిబంధనలను ఉల్లంఘించాయని ఆరోపించింది వాట్సప్. గతేడాది అమలులోకి వచ్చిన కొత్త ఐటీ చట్టం కారణంగా ఈ చర్య తీసుకోవడం జరిగిందని పేర్కొంది. ఆ చట్టం ప్రకారం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లన్నీ IT చట్టాల పరిధిలోకి వస్తాయి.

కొత్త చట్టంలోని నియమాల ప్రకారం.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి నెల వచ్చే ఫిర్యాదులపై తీసుకున్న చర్యల గురించి సమాచారాన్ని ఇవ్వాలి. తాజా నివేదికల ప్రకారం, వాట్సాప్ మార్చి 1 నుంచి 31వ తేదీల మధ్య 18 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. వాటిపై చర్యలు తీసుకుంటోంది. తమకు 597 ఫిర్యాదుల నివేదికలు అందాయని, వాటిలో 74 మందిపై చర్యలు తీసుకున్నామని కంపెనీ నెలవారీ నివేదికలో పేర్కొంది.

దుర్వినియోగ గుర్తింపు.. దుర్వినియోగాన్ని గుర్తించే విధానం ద్వారా నియమాలు, నిబంధనలను ఉల్లంఘించే ఖాతాలను గుర్తించినట్లు కంపెనీ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. నివేదిక ఫీచర్ నుండి వచ్చిన ప్రతికూల ఫీడ్‌బ్యాక్ నుండి కంపెనీ అటువంటి ఖాతాల గురించి సమాచారాన్ని పొందింది. దీంతో తప్పుడు సమాచారం, ఇతర అక్రమ పనులకు పాల్పడుతున్న ఆ ఖాతాలను డీయాక్టివేట్ చేశారు.

వాట్సాప్ అకౌంట్స్ ఎందుకు నిషేధించారు.. తప్పుడు సమాచారాన్ని ఫార్వార్డ్ చేయడం, ఇతర వినియోగదారులను మోసం చేయడం ఈ ఖాతాలను బ్యాన్ చేయడానికి ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. ఇటీవలి కాలంలో వాట్సాప్ తన వినియోగదారుల భద్రత కోసం ప్లాట్‌ఫారమ్‌ను మెరుగుపరిచే చర్యలు చేపడుతోంది. పుకార్లు సృష్టించడం, అసత్య ప్రచారాన్ని స్ప్రెడ్ చేయడం మొదలైన వాటిని అరికడుతోంది. తద్వారా బావోద్వేగాలను ప్రేరేపించే చర్యలను అరికడుతోంది.

ఫిబ్రవరిలో 14 లక్షల ఖాతాల బ్యాన్.. వాట్సాప్ సంస్థ ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఫిబ్రవరి నెలలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న 14 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. వీటిపై ఫిర్యాదులు అందుతున్నాయని మెటా గతంలో గ్రీవెన్స్ నివేదికలో తెలిపింది. ఫిబ్రవరి నెలలో కంపెనీకి 335 గ్రీవెన్స్ రిపోర్టులు అందాయి. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైంటిస్ట్, నిపుణులు నిరంతరం పని చేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.

Also read:

Rahul Gandhi Telangana Tour: రాహుల్ పర్యటనలో కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ..? సెంటిమెంట్‌తోనే చెక్ పెట్టేందుకు..!

Lord Shiva Worship: సోమవారం నాడు శివుడికి ఇవి సమర్పించండి.. కోరిన కోరికలు నెరవేరుతాయట..!

Viral Video: తొలిసారి బాదంపప్పు టేస్ట్ చేసిన ఉడత.. దాని రియాక్షన్ అస్సలు ఊహించలేరు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు