Whatsapp: వాట్సాప్‌లో వచ్చిన ఈ కొత్త ఫీచర్ గమనించారా.? ఉపయోగం ఏంటంటే..
ఇదిలా ఉంటే యూజర్ల అవసరాలకు, సెక్యూరిటీ పెద్ద పీట వేస్తూ కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కేవలం మెసేజేస్, ఆడియో, వీడియో కాల్స్‌కు మాత్రమే పరిమితమైన వాట్సాప్‌తో తాజాగా ఏఐ ఫీచర్‌ను జోడించనుంది. ఇప్పటికే ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షిస్తోంది. భారత్‌లో ఎంపిక చేసిన...
ప్రతీ ఒక్క స్మార్ట్ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏకైక మెసేజింగ్ యాప్ వాట్సాప్. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తొంది కాబట్టి ఈ యాప్‌కు ఇంతకీ క్రేజ్ ఉంది. ఎన్ని రకాల మెసేజింగ్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్‌కు క్రేజ్ తగ్గకపోవడానికి ఇదే కారణంగా చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే యూజర్ల అవసరాలకు, సెక్యూరిటీ పెద్ద పీట వేస్తూ కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కేవలం మెసేజేస్, ఆడియో, వీడియో కాల్స్‌కు మాత్రమే పరిమితమైన వాట్సాప్‌తో తాజాగా ఏఐ ఫీచర్‌ను జోడించనుంది. ఇప్పటికే ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షిస్తోంది. భారత్‌లో ఎంపిక చేసిన కొందరు యూజర్లకు ఈ ఫీచర్ కనిపించింది. అయితే కాసేపటికే అదృశ్యమైంది.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరిస్తున్న నేపథ్యంలో మెటా సైతం ఈ రంగంలోకి వస్తోంది. ఇందులో భాగంగానే ఇతర కంపెనీలతో పోటీగా మెటా కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారిత మెటా ఏఐని (Meta AI) రూపొందించింది. ఇప్పుడు దీనినే వాట్సాప్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్‌ను క్లిక్ చేయగానే.. ‘ఆస్క్ మెటా ఏఐ ఎనీథింగ్’ అంటూ ఓ పాప్ ఓపెన్ అవుతుంది. కంటిన్యూపై క్లిక్ చేస్తే మెటా ఏఐతో చాట్ మెనూ ఓపెన్ అవుతుంది.
ఇందులో మీకు సందేహం ఉన్న ఈ అంశాన్ని సెర్చ్ చేసిన చాట్ జీపీటీ తరహాగా సమాధానాలు ఇస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..