- Telugu News Photo Gallery Technology photos Do you know how to set your text message at scheduled time
Message: సెట్ చేసిన సమయానికి మెసేజ్ పంపించాలా.? ఇలా చేయండి..
అర్థరాత్రి సరిగ్గా 12 గంటలకు ఎవరికైనా పుట్టిన రోజు విషెస్ మెసేజ్ చేయాలనుకుంటారు.? కానీ అప్పటి వరకు మెలకువతో ఉండకపోతే ఎలా.? అలా కాకుండా మీరు కోరుకున్న సమయానికి మెసేజ్ అవతలి వ్యక్తికి సెండ్ అయ్యేలా సెట్ చేసుకునే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ! అయితే ఈ అవకాశం ప్రస్తుతం ఈ మెయిల్స్‌కు మాత్రమే ఉంది. మరి నార్మల్ మెసేజ్‌ను కూడా ఇలా టైమ్ సెట్ చేసుకోవచ్చని మీకు తెలుసా.? ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 11, 2024 | 8:29 PM

ఆండ్రాయిడ్ యూజర్లు తమనకు నచ్చిన సమయానికి మెసేజ్‌ను పంపించుకునేలా సెట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. ఇందుకోసం యూజర్లు ముందుగా ప్లే స్టోర్ నుంచి గూగుల్ మెసేజెస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోల్సి ఉంటుంది. అనంతరం ఈ యాప్‌ను డిఫాల్ట్ ఎస్‌ఎంఎస్ యాప్‌గా సెట్ చేసుకోవాలి.

యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత స్టార్ట్ ఛాట్ మీద క్లిక్ చేయాలి. లేదంటే మీ కాంటాక్ట్ లిస్ట్‌లో నుంచి కన్వర్జేషన్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం కన్వర్జేషన్ బాక్సు మీద క్లిక్ చేసి సందేశాన్ని టైప్ చేయాలి. సందేశం నిర్ణీత సమయానికి అవతలివారికి అందాలనుకుంటే బాక్సు పక్కన కనిపించే ప్లస్ గుర్తును క్లిక్ చేయాలి.

లేదంటే సెండ్ బటన్ కాసేపు లాంగ్ ప్రెస్ చేయాలి. ఇలా చేయగానే షెడ్యూల్డ్ సెండ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేయగానే.. కొన్ని సమయాలు డిఫాల్ట్‌గా కనిపిస్తాయి. అవసరాన్ని బట్టి సమయాన్ని ఎంచుకోవచ్చు.

ఒకవేళ అందులో మీరు కోరుకున్న సమయం లేకపోతే.. ‘పిక్ డేట్ అండ్ టైమ్’ మీద క్లిక్ చేయాలి. క్యాలెండర్‌లో కనిపించే తేదీ, సమయాన్ని ఎంచుకొని సెట్ బటన్‌ను నొక్కాలి.

చివరిగా టైప్ చేసిన మెసేజ్, సెలక్ట్ చేసుకున్న తేదీ, టైమ్ కనిపిస్తాయి. తర్వాత సెండ్ బటన్ నొక్కితే చాలు సెలక్ట్ చేసుకున్న వ్యక్తి ఛాట్‌కు యాడ్ అవుతుంది. దాని పక్కన షెడ్యూల్డ్ గుర్తు కూడా కనిపిస్తుంది. ఎంచుకున్న సమయానికి మెసేజ్ దానంతటదే వెళ్లిపోతుంది




