Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: అదిరిపోయే ట్రిక్.. డిలీట్ చేసిన ఫోటోలు, వీడియోలను ఈజీగా తిరిగి పొందవచ్చు.. అదెలాగంటే..

మేటా యాజమాన్యంలోని ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాధరణ కలిగి ఉంది. మిలియన్ల మంది ప్రజలు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. నిత్యం వేలాది మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోస్ షేర్ చేసుకుంటారు. కొన్ని కీలకమైన డాక్యూమెంట్స్ కూడా ఈ వాట్సాప్ ద్వారా షేర్ చేసుకుంటారు. అయితే, కొన్నిసార్లు అనుకోకుండానే కొన్ని ముఖ్యమైన ఫోటోలు, వీడియోలో డిలీట్ అవుతాయి. మీరు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారా?

WhatsApp: అదిరిపోయే ట్రిక్.. డిలీట్ చేసిన ఫోటోలు, వీడియోలను ఈజీగా తిరిగి పొందవచ్చు.. అదెలాగంటే..
Whatsapp
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 12, 2023 | 9:41 AM

మేటా యాజమాన్యంలోని ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక జనాధరణ కలిగి ఉంది. మిలియన్ల మంది ప్రజలు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. నిత్యం వేలాది మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోస్ షేర్ చేసుకుంటారు. కొన్ని కీలకమైన డాక్యూమెంట్స్ కూడా ఈ వాట్సాప్ ద్వారా షేర్ చేసుకుంటారు. అయితే, కొన్నిసార్లు అనుకోకుండానే కొన్ని ముఖ్యమైన ఫోటోలు, వీడియోలో డిలీట్ అవుతాయి. మీరు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారా? అయితే, ఇక భయపడాల్సిన పనిలేదు. డిలీట్ అయిన ఫోటోలు, వీడియోలను తిరిగి పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వాట్సాప్‌లో డిలీట్ అయిన ఫోటోలు, వీడియోలను తిరిగి పొందేందుకు ప్రస్తుతం అనేక మార్గాలు ఉన్నాయి. వీటి ద్వారా వాట్సాప్ మీడియా ఫైల్స్‌ను సులభంగా తిరిగి పొందవచ్చు. వీటిని తిరిగి పొందడానికి పెద్ద టెక్నికల్ నాలేడ్జ్ కూడా ఏమీ అవసరం లేదు. ఎవరైనా దీన్ని సులభంగా ప్రయత్నించవచ్చు. వాట్సాప్‌కు సంబంధించి ఈ స్పెషల్ ట్రిక్‌ పై ఓసారి లుక్కేయండి..

ఫోన్ గ్యాలరీ..

డీఫాల్ట్‌గా వాట్సాప్‌కు సంబంధించి అన్ని ఫోటోలు, వీడియోలు ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటి ఫోన్ గ్యాలరీలో సేవ్ అవుతుంటాయి. ఒకవేళ మీ వాట్సాప్ నుంచి వీడియో, ఫోటో, డాక్యూమెంట్ ఫైల్ డిలీట్ అయినా.. వాటిని ఫోన్ గ్యాలరీలో తిరిగి పొందవచ్చు. వాటిని మళ్లీ షేర్ చేసుకోవచ్చు.

ఫైల్ ఎక్స్‌ప్లోరర్..

ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లోని వాట్సాప్ ఫోల్డర్‌కు వెళ్లడం ద్వారా మీడియా ఫైల్‌ల నుండి తొలగించబడిన ఫోటోలు, వీడియోలను తిరిగి పొందవచ్చు.

వాట్సాప్ బ్యాకప్..

మీరు వాట్సాప్ చాట్‌లు, మీడియాను రోజువారీ, వారం, నెలవారీ ప్రాతిపదికన Google డిస్క్, iCloudకి బ్యాకప్ చేయవచ్చు. చాట్‌లు, మీడియా ఫైల్‌లు డిలీట్ అయినట్లయితే.. మీ వాట్సాప్‌ను తొలగించి, దాన్ని మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోండి. వాట్సాప్ లాగిన్ సమయంలో, మీరు రికవరీ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీ ఫోటోలు, వీడియోలను అన్నింటిని తిరిగి పొందవచ్చు.

డిలీట్ మీడియా ఆప్షన్‌ను ఆఫ్ చేయండి..

కొన్నిసార్లు మనం చాట్‌ని డిలీట్ చేసినప్పుడు కొన్ని ముఖ్యమైన మీడియా ఫైల్స్ కూడా పొరపాటున డిలీట్ అవుతుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాట్‌ను డిలీట్ చేసే ముందు.. డిలీట్ మీడియా ఆప్షన్‌ను టిక్ చేయకుండా ఉండండి. దీని కారణంగా చాట్‌లు డిలీట్ అయి.. మీడియా ఫైల్స్ మీ మొబైల్‌లో సేఫ్‌గా ఉంటాయి.

థర్డ్ పార్టీ యాప్..

ప్రస్తుత కాలంలో చాలా మంది మేసేజ్‌లు పంపి.. వాటిని వెంటనే డిలీట్ చేస్తుంటారు. అలాంటి మెసేజ్‌లను కూడా మీరు తిరిగి పొందవచ్చు. ఇందుకోసం మీరు థర్డ్ పార్టీ యాప్‌లను వినియోగించొచ్చు. ప్లే స్టోర్ నుంచి WAMR అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా.. దాని సహాయంతో తొలగించిన ఫోటోలు వీడియోలను మాత్రమే కాకుండా చాట్‌లను కూడా తిరిగి పొందగలుగుతారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..