AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరిన్ని అద్భుత ఫీచర్లతో రానున్న వాట్సాప్!

ఇప్పటికే వాట్సాప్ లో ఎన్నో ఫీచర్లు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రతి అప్ డేట్ కు వాట్సాప్ ఏదో ఒక ఫీచర్ ను అందిస్తూనే ఉంది. ఈసారి తాజాగా వాట్సాప్ లో డార్క్ మోడ్ ను కూడా అందించే ఆలోచనలో వాట్సాప్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా Disappearing messages అనే సరికొత్త ఫీచర్ వాట్సాప్ లో అందుబాటులోకి రానుంది. వాట్సాప్ బీటా వెర్షన్ 2.19.282 ద్వారా ఇవి మొదటగా బీటా యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఆ […]

మరిన్ని అద్భుత ఫీచర్లతో రానున్న వాట్సాప్!
TV9 Telugu Digital Desk
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 09, 2019 | 12:35 PM

Share

ఇప్పటికే వాట్సాప్ లో ఎన్నో ఫీచర్లు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రతి అప్ డేట్ కు వాట్సాప్ ఏదో ఒక ఫీచర్ ను అందిస్తూనే ఉంది. ఈసారి తాజాగా వాట్సాప్ లో డార్క్ మోడ్ ను కూడా అందించే ఆలోచనలో వాట్సాప్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా Disappearing messages అనే సరికొత్త ఫీచర్ వాట్సాప్ లో అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ బీటా వెర్షన్ 2.19.282 ద్వారా ఇవి మొదటగా బీటా యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత కొద్దికాలానికే సాధారణ వినియోగదారులకు కూడా ఇవి అందుబాటులోకి వస్తాయి. వాట్సాప్ లో డార్క్ మోడ్ కు సంబంధించిన ఆలోచనను ఈ సంవత్సరం మార్చిలోనే ప్రారంభమైంది. అయితే నెలలు గడుస్తున్నా దీనిపై ఎటువంటి వార్తలు రాకపోవడంతో ఈ విషయంలో వాట్సాప్ వెనక్కి తగ్గినట్లేనని అందరూ అనుకున్నారు. అయితే సడెన్ గా ఈ ఫీచర్ ను మళ్లీ తెరమీదకు తీసుకువచ్చింది.

అసలు డార్క్ మోడ్ వల్ల ఉపయోగం ఏంటంటే.. మనం ఫోన్ ఉపయోగించేటప్పుడు సాధారణ మోడ్ లో ఉపయోగిస్తే దాని నుంచి వచ్చే ఆ కాంతి మన కళ్లపై ప్రభావం చూపిస్తుంది. ఫోన్ బ్యాటరీ కూడా తొందరగా అయిపోతుంది. అదే డార్క్ మోడ్ అందుబాటులో ఉంటే బ్యాక్ గ్రౌండ్ మొత్తం నల్ల రంగులోకి లేదా బూడిద రంగులోకి మారిపోతుంది. దీని కారణంగా మన కంటిపై ఆ కాంతి ప్రభావం తగ్గడంతో పాటు, ఫోన్ చార్జింగ్ కూడా ఎక్కువ సేపు వస్తుంది. అందుకే ఏ యాప్ కి అయినా డార్క్ మోడ్ అందుబాటులో ఉంటే దాన్ని ఉపయోగించడం మంచిది.

ఇక మరో ఫీచర్ విషయానికి వస్తే.. ఇప్పటి దాకా వాట్సాప్ లో మనం మెసేజ్ లు డిలీట్ చేయాలంటే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ ను మాత్రమే ఉపయోగించాం. కానీ ఈ Disappearing Messages ఫీచర్ అందుబాటులోకి వస్తే మనం ఒక మెసేజ్ ను పంపేటప్పుడే అది ఎంతసేపు అవతలి వాళ్లకి కనిపించాలి అనే టైమ్ ను సెట్ చేయవచ్చు. ఆ నిర్ణీత సమయం పూర్తి కాగానే మాంత్రికుడు మంత్రం వేసినట్లు ఆ మెసేజ్ మాయం అయిపోతుంది. ఇందులో ఉండే టైమర్ ద్వారా మనకు ఐదు రకాల టైమింగ్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఐదు సెకండ్లు, ఒక గంట, ఒక రోజు, ఏడు రోజులు, 30 రోజులుగా ఆ టైమింగ్స్ ఉన్నాయి. ఈ టైమింగ్స్ లో ఏదో ఒక టైమింగ్ ను మీరు ఎంచుకుంటే ఆ నిర్ణీత కాల వ్యవధి అనంతరం ఆ మెసేజ్ డిలీట్ అయిపోతుందన్న మాట.

డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆప్షన్ ను ఉపయోగిస్తే అక్కడ ‘This message was deleted’ అనే అలెర్ట్ కనిపిస్తుంది. కానీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. అసలు మీరు మెసేజ్ పంపారు అనడానికి ఎటువంటి ఆధారం ఉండదు. దీని ద్వారా మీకు మరింత ప్రైవసీ పెరుగుతుంది. అయితే డార్క్ మోడ్, డిసప్పియరింగ్ మెసేజ్ లు సాధారణ వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో ఇంకా పూర్తిగా తెలియలేదు. ఈ రెండే కాకుండా వాట్సాప్ లో ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం చివరికి వాట్సాప్ వీటిని విడుదల చేస్తుందని కొందరు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం ఏం అవుతుందో? ఇవి ఎప్పటికి వస్తాయో!