మీ వాట్సాప్ ఎప్పుడైనా డిలీట్ అవ్వొచ్చు.. కాపాడుకోండిలా..!

ఫేక్‌ న్యూస్‌ను అడ్డుకునేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పలు చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే వాట్సాప్ ఫ్వార్వర్డ్ లిమిట్‌ను తగ్గించడం వంటి చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే త్వరలో వాట్సాప్ కొందరి అకౌంట్లను బ్యాన్ చేస్తుందన్న పుకార్లు ఇటీవల బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే కొందరు, తమ అకౌంట్లు బ్యాన్ అయ్యాయని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు కూడా చేస్తున్నారు. గ్రూప్‌లలో సభ్యుల వివరాలు సరిగ్గా లేవన్న కారణంగా వాట్సాప్ తమ అకౌంట్లను బ్యాన్ […]

మీ వాట్సాప్ ఎప్పుడైనా డిలీట్ అవ్వొచ్చు.. కాపాడుకోండిలా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 13, 2019 | 5:24 PM

ఫేక్‌ న్యూస్‌ను అడ్డుకునేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పలు చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే వాట్సాప్ ఫ్వార్వర్డ్ లిమిట్‌ను తగ్గించడం వంటి చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే త్వరలో వాట్సాప్ కొందరి అకౌంట్లను బ్యాన్ చేస్తుందన్న పుకార్లు ఇటీవల బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే కొందరు, తమ అకౌంట్లు బ్యాన్ అయ్యాయని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు కూడా చేస్తున్నారు. గ్రూప్‌లలో సభ్యుల వివరాలు సరిగ్గా లేవన్న కారణంగా వాట్సాప్ తమ అకౌంట్లను బ్యాన్ చేసిందని వారు ఆరోపిస్తున్నారు. కానీ పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన గ్రూపులు, అలాంటి పోస్టులు ఫార్వర్డ్ చేస్తున్న సభ్యుల్ని మాత్రమే వాట్సాప్ బ్యాన్ చేస్తోంది. గ్రూప్‌ల పేర్లు, సభ్యుల పేర్ల విషయంలో వాట్సాప్‌కు స్పష్టమైన గైడ్‌లైన్స్ ఉన్నాయి. వాట్సాప్ యూసేజ్ పాలసీలో వీటన్నింటిని మనం స్పష్టంగా చూడొచ్చు. ఏది ఏమైనా వాట్సాప్‌లో అకౌంట్ గానీ, గ్రూప్ గానీ ఒక్కసారి బ్యాన్ అయితే.. మళ్లీ తిరిగి పొందడం అసాధ్యం. ఇలాంటి సమయంలో వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేముందు ఒకసారి వాట్సాప్ సెక్యురిటీ బ్లాగ్, యూసేజ్ రూల్స్ తెలుసుకుంటే మంచిది. ఇక మీ గ్రూప్ పేరు కూడా అభ్యంతరకరంగా ఉండకూడదు. ఇక మీరు గ్రూప్ అడ్మిన్ అయితే.. మీ గ్రూప్‌లోని సభ్యులు అభ్యంతరకర పోస్టులు ఫార్వర్డ్ చేస్తే హెచ్చరించొచ్చు. నచ్చకపోతే ఆ సభ్యులను గ్రూప్ నుంచి తొలగించవచ్చు. ఇది కాకుండా మీరు యూజర్ అయితే.. ఏ గ్రూప్‌లో చేరాలన్నది మీరే నిర్ణయించుకోవచ్చు. ఇందుకోసం ప్రైవసీ సెట్టింగ్‌లో మీరు మార్పులు చేసుకోవచ్చు. ఇక మీ వాట్సాప్ బ్యాన్ అయినట్లైతే.. పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన మెసేజ్‌లేవీ మా గ్రూప్‌లో లేవని వాట్సాప్‌కు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం వాట్సాప్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న హెల్ప్ ఛానెల్స్ వాడుకోవచ్చు. సో ఈ రోజే మీ వాట్సాప్‌ను చెక్‌ చేసుకోండి మరి.

ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..