కృత్రిమ మేధస్సు చెప్పే జోస్యం నిజమవుతుందా ?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు ) పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ ‘ వ్యవస్థ ‘ రోగి ఏడాదిలోగా మరణిస్తాడా అన్న విషయమై ముందుగానే అంచనా వేసే (జోస్యం చెప్పే) స్థాయికి ‘ ఎదిగిందట.అంటే ఒకవిధంగా చెప్పాలంటే కంప్యూటర్ సిస్టమ్స్ లోని ప్రోగ్రామ్స్ మానవ ఆలోచనా శక్తిని అధిగమింపజేస్తున్నాయి. ఈ సిస్టమ్స్ దాదాపు రోబోల్లాగా తమకు తాము నేర్చుకోవడం, వంటివి చేస్తాయట.. ఒక విధంగా రాబోయే కొన్నేళ్లలో ఇది మానవాళికి హానికరమే అయినా.. […]
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు ) పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ ‘ వ్యవస్థ ‘ రోగి ఏడాదిలోగా మరణిస్తాడా అన్న విషయమై ముందుగానే అంచనా వేసే (జోస్యం చెప్పే) స్థాయికి ‘ ఎదిగిందట.అంటే ఒకవిధంగా చెప్పాలంటే కంప్యూటర్ సిస్టమ్స్ లోని ప్రోగ్రామ్స్ మానవ ఆలోచనా శక్తిని అధిగమింపజేస్తున్నాయి. ఈ సిస్టమ్స్ దాదాపు రోబోల్లాగా తమకు తాము నేర్చుకోవడం, వంటివి చేస్తాయట.. ఒక విధంగా రాబోయే కొన్నేళ్లలో ఇది మానవాళికి హానికరమే అయినా.. ఓ సరికొత్త అంశం మాత్రం షాకింగ్ న్యూసే ! మెషీన్లు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను బహిర్గతం చేస్తాయని నమ్ముతున్న పెన్సిల్వేనియా పరిశోధకుల కథనం ప్రకారం.. రోగుల మరణాలను ముందుగానే అంచనా వేయగల అసాధారణ మేధస్సు వీటిలో నిక్షిప్తమై ఉంటుందట.. ముఖ్యంగా ఏడాదిలోగా వారు ఏ జబ్బుతోనో మరణించవచ్ఛునని ఈ కృత్రిమ మేధస్సు జోస్యం చెబుతోందని అంటున్నారు. వీరు దాదాపు 4 లక్షల మంది రోగుల నుంచి సేకరించిన సుమారు 1.77 మిలియన్ల ఈసీజీల ఫలితాలను విశ్లేషించారు. మొదట తీసిన ఈసీజీ సిగ్నల్స్ ను నేరుగా ఎనలైజ్ చేయడం ద్వారానో, కార్డియాలజిస్టులు రికార్డు చేసిన స్టాండర్డ్ ఈసీజీ ఫీచర్స్ నో వీరు ఎనలైజ్ చేశారు. ఈ రికార్డుల ప్రకారం.. ఒక రోగి ఏడాదిలోగా ఏ శారీరక రుగ్మతతోనో మృత్యువాత పడవచ్ఛునని ముందే అంచనా వేయవచ్చునని అంటున్నారు.న్యూరాల్ నెట్ వర్క్ అన్న సూత్రం ప్రకారం తాము ముఖ్యంగా ఈసీజీ సిగ్నల్స్ ని విశ్లేషించామని చెబుతున్నారు.