2G, 3G, 4G, 5Gలో ‘G’ అంటే ఏంటో మీకు తెలుసా.. మీరు వాడుతున్న ఫోన్‌లో Gbps ను ఎప్పుడైనా చూశారా..
మనం రోజంతా 2G, 3G, 4G, 5G,Kbps, Mbps, Gbps వంటి పదాలను ఉపయోగిస్తుంటాం. అయితే వాటి గురించిన పూర్తి వివరాలు మీకు తెలుసా?..ఈ సమాచారం మనలో చాలా మందికి తెలియక పోవచ్చు.. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మనం 6-7 ఏళ్ల క్రితం నుంచి ఇంటర్నెట్‌ను ఎక్కవగా వాడుతున్నాం. అప్పట్లో ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉండేదనే విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో భారత్‌లో 3జీ వ్యవస్థ ఉండేది. అయినప్పటికీ, అంతకు ముందు కూడా ఇంటర్నెట్ నడిచేది. ఆ సమయంలో 2G వ్యవస్థ ఉంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా.. మన దేశం ఇంటర్నెట్ ప్రపంచంలో చాలా వేగంగా అభివృద్ధి చెందింది. మనదేశంలో మొదటి 4G, ఇప్పుడు ఇంటర్నెట్ 5G వేగంతో నడుస్తోంది. అయితే చాలా మందిని ఎక్కువగా వేధించే ఒక ప్రశ్న ఏంటంటే 2G, 3G, 4G, 5Gలలో ‘G’ అంటే ఎంటి.. దీనిని ఏమంటారు. అసలు ఈ “G” ని ఏమని పిలుస్తారో తెలుసుకుందాం..
2G, 3G, 4G, 5Gలో G అంటే ఏంటి?
ఇక్కడ “G” అంటే జనరేషన్. 5G (5వ తరం మొబైల్ నెట్‌వర్క్) అర్థం. అదేవిధంగా, 2G, 3G, 4G లో కూడా G అంటే జనరేషన్. ఇంటర్నెట్ స్పీడ్ పెరిగేకొద్దీ, దాని సాంకేతికత మెరుగుపడుతుంది. ఇది ఈ తరంతో అనుబంధించబడిన సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రస్తుతం మీరు 5G ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. కానీ కొంత కాలం తర్వాత మరింత అధునాతన స్థాయి ఇంటర్నెట్ వస్తుంది. మీరు 6G, 7G ఇంటర్నెట్‌ను కూడా ఉపయోగిస్తారు.
Kbps, Mbps, Gbps మధ్య తేడా ఏంటంటే..
Kbps, Mbps, Gbps మీ ఇంటర్నెట్ వేగాన్ని తెలియజేస్తాయి. మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లో అయితే అది 2Gలో నడుస్తుంటే అది Kbpsలో రన్ అవుతుంది. ఇక్కడ Kbps అంటే ‘సెకనుకు కిలో బైట్’. మరోవైపు, Mbps గురించి చెప్పాలంటే.. 4G, 5G వచ్చినప్పటి నుంచి ఇది మీ ఫోన్‌లో ప్రారంభమైంది. 3Gలో ఇంటర్నెట్ చాలా అరుదుగా Mbpsలో పని చేసింది. Mbps అంటే సెకనుకు మెగాబైట్. ఇందులో Gbps అంటే సెకనుకు గిగాబైట్. Gbps అంటే చాలా హై స్పీడ్ ఇంటర్నెట్, ఇది ప్రస్తుతానికి ఏ సాధారణ ఫోన్‌లోనూ రన్ కావడం లేదు.
5G వేగం ఎంత ఉండొచ్చంటే..
ప్రస్తుతం, భారతదేశంలోని ప్రతి నగరంలో 5G సౌకర్యం అందుబాటులో లేదు. అయితే, పెద్ద నగరాల్లో 5G సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లలో రన్ చేయడం ప్రారంభించింది. దాని వేగం గురించి మాట్లాడితే.. సమాచారం ప్రకారం, 5G వేగం 4G కంటే 100 రెట్లు వేగంగా ఉండే అవకాశం ఉంది. దీని గరిష్ట వేగం 20 Gbps వరకు ఉంటుంది. వాస్తవ ప్రపంచంలో 5G వేగం 50 Mbps నుంచి 3 Gbps వరకు ఉంటుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం