AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Redmi: ఊహకు కూడా ఇది కష్టమే.. కళ్లు చెదిరే వేగంతో ఫోన్‌ ఛార్జింగ్‌. కేవలం 5 నిమిషాల్లోనే..

స్మార్ట్‌ఫోన్‌కు ప్రధానమైన శత్రువు ఏదైనా ఉందంటే అది ఛార్జింగ్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ అవసరానికి ఒక యాప్‌ అందుబాటులోకి వచ్చిన తరుణంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. దీంతో ఛార్జింగ్‌ త్వరగా తగ్గడం వంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో..

Redmi: ఊహకు కూడా ఇది కష్టమే.. కళ్లు చెదిరే వేగంతో ఫోన్‌ ఛార్జింగ్‌. కేవలం 5 నిమిషాల్లోనే..
Narender Vaitla
|

Updated on: Feb 28, 2023 | 6:41 PM

Share

స్మార్ట్‌ఫోన్‌కు ప్రధానమైన శత్రువు ఏదైనా ఉందంటే అది ఛార్జింగ్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ అవసరానికి ఒక యాప్‌ అందుబాటులోకి వచ్చిన తరుణంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. దీంతో ఛార్జింగ్‌ త్వరగా తగ్గడం వంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో కంపెనీలు ఛార్జింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. త్వరగా బ్యాటరీ ఫుల్‌ అయ్యే టెక్నాలజీతో యూజర్లను ఆకట్టుకుంటున్నారు. నిమిషాల్లోనే పూర్తి చార్జ్ అయ్యే హై కెపాసిటీ చార్జర్‌లు, కంపటబుల్ స్మార్ట్ ఫోన్లు చాలా వరకు మార్కెట్లో లాంచ్ అయ్యాయి.

ఈ క్రమంలోనే చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ సైతం ఓ అధునాతన ఛార్జర్‌ను తీసుకొస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 300W చార్జింగ్ టెక్నాలజీని లాంచ్‌ చేస్తున్నట్లు అధికారికంగా ప్రటించింది. 4100 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ కేవలం 5 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌ కావడం ఈ ఛార్జర్‌ ప్రత్యేకగా చెప్పొచ్చు. దీనికి సంబంధించిన డెమో వీడియోను సైతం కంపెనీ ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేసింది. ఈ కొత్త చార్జింగ్ టెక్నాలజీకి 300W ఇమ్మోర్టల్ సెకండ్ ఛార్జర్ అనే పేరు పెట్టారు.

అయితే ఈ ఛార్జర్‌ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న దానిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం రియల్‌మీ జీటీ నియో5 పేరుతో ఓ ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో 240W చార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేశారు. ఇది కేవలం 9 నిమిషాల 30 సెకన్లలో 0% నుంచి 100%, కేవలం 4 నిమిషాల్లో 0% నుంచి 50% వరకు చార్జ్ అవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..