Android Phone: ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఈ పని చేయకపోతే మీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది జాగ్రత్త..
మీరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారా? అది కూడా ఆండ్రాయిడ్ ఓఎస్ తో కూడిన ఫోన్ వాడుతున్నారా? అయితే మీకో అలర్ట్. ఆండ్రాయిడ్ 13 అంతకన్నా పాత వెర్షన్ల ఆండ్రాయిడ్ డివైజ్ లకు పెను ముప్పు పొంచి ఉంది. వాటిల్లో అనేక లోపాలు ఉన్నట్లు ఇటీవల గుర్తించారు. ఫలితంగా వీటిని హ్యాకర్లు సులభంగా హ్యాక్ చేసేయగలరని చెబుతున్నారు. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT).

మీరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారా? అది కూడా ఆండ్రాయిడ్ ఓఎస్ తో కూడిన ఫోన్ వాడుతున్నారా? అయితే మీకో అలర్ట్. ఆండ్రాయిడ్ 13 అంతకన్నా పాత వెర్షన్ల ఆండ్రాయిడ్ డివైజ్ లకు పెను ముప్పు పొంచి ఉంది. వాటిల్లో అనేక లోపాలు ఉన్నట్లు ఇటీవల గుర్తించారు. ఫలితంగా వీటిని హ్యాకర్లు సులభంగా హ్యాక్ చేసేయగలరని చెబుతున్నారు. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT). ఈ సంస్థ పాత ఆండ్రాయిడ్ వెర్షన్లు వినియోగిస్తున్న వారికి ఈ హెచ్చరికను జారీ చేసింది. సెర్ట్ అధికారిక వెబ్ సైట్లో ఈ లోపాలను హైలైట్ చేస్తూ వినియోగదారులకు గలిగే నష్టాలను, అలాగే సంరక్షణ విధానాలను వివరించింది. వాటి గురంచి ఇప్పుడు తెలుసుకుందాం..
క్రిటికల్ లేబుల్..
సెర్ట్(CERT) చెబుతున్న దాని ప్రకారం ఆండ్రాయిడ్ 13 కన్నా ముందున్న ఆండ్రాయిడ్ డివైజ్ లకు ముప్పు ఉంది. దీనిని ‘క్రిటికల్’ గా పేర్కొంది. వీటి ద్వారా సైబరాసులు సులభంగా మీ డివైజ్ లను హ్యాక్ చేయగలరని వివరించింది. ఈ లోపాల ద్వారా మీ ఫోన్ మొత్తాన్ని దుండగులు యాక్సెస్ చేయగలుగుతారని పేర్కొంది. మీ పరికరంలో దుండగులు వారి స్వంత కోడ్‌ను అమలు చేయడం, ఉన్నతమైన అధికారాలను పొందడం, సున్నితమైన వినియోగదారు సమాచారాన్ని యాక్సెస్ చేయడం వంటి అనేక హాని కరమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. సరళంగా చెప్పాలంటే, ఈ భద్రతా లోపాల కారణంగా హ్యాకర్లు మీ ఆండ్రాయిడ్ డివైజ్ ను పూర్తిగా నియంత్రణలోకి తీసుకొని, మీ డేటాను దొంగిలిస్తారు. అంతేకాక దానిని నిరుపయోగంగా మార్చేస్తారు.
ఈ వెర్షన్లపై ప్రభావం.. సెర్ట్ చెబుతున్న దాని ప్రకారం ఆండ్రాయిడ్ 13తో పాటు అంతకన్నా ముందు వెర్షన్లలో వీటిని కొనుగొన్నట్లు చెబుతున్నారు. ఆండ్రాయిడ్ 11, 12, 12ఎల్, 13 వెర్షన్లలో లోపాలు గుర్తించినట్లు చెబుతున్నారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ లోపాలు మీ పరికరంలోని ఏదో ఒక భాగానికి మాత్రమే పరిమితం కావు; అవి ఆండ్రాయిడ్ సిస్టమ్‌లోని వివిధ భాగాలలో కనిపిస్తాయి. ఇందులో ఫ్రేమ్‌వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్‌లు, అలాగే ఆర్మ్, మీడియాటెక్, యూనిసోక్, క్వాల్కామ్ లకు చెందిన క్లోజ్డ్ సోర్స్ కాంపోనెంట్‌ల వంటి విభిన్న హార్డ్‌వేర్ భాగాల్లో ఈ లోపాలున్నాయి.
అదృష్టవశాత్తూ, సమస్యలను పరిష్కరించే ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ డేట్ ను గూగుల్ ఇప్పటికే విడుదల చేసింది. అందువల్ల, వినియోగదారులు తమ పరికరాలను వెంటనే అప్‌డేట్ చేయాలని సూచించింది.
మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎలా రక్షించుకోవాలి..
- వినియోగదారులు తమ పరికరాన్ని లోపాల నుంచి బయటపడటంతో పాటు భవిష్యత్తులో జరిగే ఇతర హానికరమైన దాడుల నుంచి రక్షించుకోవడానికి అనుసరించాల్సిన కొన్ని భద్రతా చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
సెక్యూరిటీ ప్యాచ్‌ల.. మీ పరికరాన్ని రక్షించడానికి అత్యంత తక్షణ, ప్రభావవంతమైన ఓఎస్ అప్ డేట్ ను చేయాలి. తద్వారా కొత్త అప్ డేట్లు సరికొత్త భద్రతా ప్యాచ్‌లు వస్తాయి. ఇవి గుర్తించిన లోపాలతో పాటు, మీ డివైజ్ భద్రతను మెరుగుపరుస్తుంది. అందుకోసం మీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం.
యాప్ డౌన్‌లోడ్‌లతో జాగ్రత్త.. ముఖ్యంగా అనధికారిక మూలాల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు, ఇన్‌స్టాల్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. థర్డ్ పార్టీ యాప్‌లను నివారించండి. గూగుల్ ప్లే స్టోర్ వంటి విశ్వసనీయ యాప్ స్టోర్‌లకు కట్టుబడి ఉండండి. అలాగూ మీరు యాప్‌లకు మంజూరు చేసే అనుమతులపై ఓ కన్నేసి ఉంచండి.
యాప్ అనుమతులను సమీక్షించండి.. మీ పరికరంలో యాప్‌లకు మంజూరు చేసిన అనుమతులను కాలానుగుణంగా సమీక్షించండి. యాప్ ఫంక్షనాలిటీకి అధికంగా లేదా అనవసరంగా అనిపించే అనుమతులను ఉపసంహరించుకోండి.
మీ డేటాను బ్యాకప్ చేయండి.. మీ డేటాను మెమరీ కార్డు లేదా క్లౌడ్ స్టోరేజ్ లో క్రమం తప్పకుండా బ్యాకప్ చేయండి. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మీ విలువైన సమాచారం సురక్షితంగా ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..