Vivo v25 5g: వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. రంగులు మార్చే ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Vivo v25 5g: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వీ25 పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ సెప్టెంబర్ 15న మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, వివో ఇ-స్టోర్‌లో ప్రీ-బుకింగ్ అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లోనే...
Vivo v25 5g: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వీ25 పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ సెప్టెంబర్ 15న మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, వివో ఇ-స్టోర్‌లో ప్రీ-బుకింగ్ అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లోనే అధునాతన ఫీచర్లను అందించారు. ఫోన్ బ్యాక్ ప్యానెల్ రంగు మారడం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా చెప్పొచ్చు. స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు మీకోసం..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.44 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12 జీబీ ర్యామ్, ఎక్స్‌టెండెడ్ ర్యామ్ 3.0ని అందించారు. ఇందులో 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
ధర విషయానికొస్తే.. 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 27,999, 12 జీబీ ర్యామ్ + 256 సీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999గా ఉంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బ్యాంకుల కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 2500 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇక ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా రంగు మారే ఫ్లోరట్ ఏజీ బ్యాక్ ప్యానెల్‌ను అందించారు. దీని వల్ల ఫోన్ బ్యాక్ ప్యానెల్‌పై సూర్యకాంతి పడితే ఫోన్ కలర్ మారుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..