WhatsApp Trick: మీరు చాట్ చేస్తున్నప్పుడు పక్కవారు చదువుతున్నారా.. అయితే ఈ ‘వర్చువల్ కర్టెన్’ వేయండి చాలు..

WhatsApp Tips: పబ్లిక్ ప్లేస్‌లో చాట్ చేస్తున్నప్పుడు.. తరచుగా ఇరుగుపొరుగు వారు మీ మెసేజ్‌లను చదవడం ప్రారంభిస్తారు. మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ఇలా చేసిన తర్వాత మీ మెసేజ్‌లను ఎవరూ చదవలేరు.

WhatsApp Trick: మీరు చాట్ చేస్తున్నప్పుడు పక్కవారు చదువుతున్నారా.. అయితే ఈ 'వర్చువల్ కర్టెన్' వేయండి చాలు..
Whatsapp Group Admin
Follow us

|

Updated on: Sep 15, 2022 | 11:06 AM

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. అందులో WhatsApp ఉండటం కామన్. అంతే కాదు ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే యాప్‌లలో వాట్సాప్ ఒకటి. ఆఫీసులు, పర్సనల్ కోసం వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ వ్యక్తిగత చాట్ నుంచి అధికారిక చాట్ వరకు ప్రతి ఒక్కరికీ ఉపయోగించబడుతుంది. మీరు ఇంట్లో, దారిలో, బహిరంగ ప్రదేశాల్లో, ప్రజా రవాణా సమయంలో కూడా వాట్సప్ చాట్ చేస్తుంటారు. కానీ బహిరంగ ప్రదేశాల్లో అతిపెద్ద సమస్య గోప్యత. పక్కవాడికి కనిపించకుండా చాట్ చేయలేము. కనిపించడంతోనే వారు చదవడం మొదలు పెడుతారు. మనం పర్సనల్ అని అనకుంటాం.. కాని కుదరదు. మీరు ఈ యాప్‌లో చాట్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వ్యక్తులు మీ చాట్‌లను చూస్తూ చదువుతారు. ఇలాంటి సమయంలో మీరు ఏమీ చేయలేరు. కానీ ఈ రోజు మనం ఈ పరిస్థితిని నివారించే చిట్కాలను తెలుసుకుందాం..

ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

మీ ఫోన్ స్క్రీన్‌పై మీ పక్కన కూర్చున్న వ్యక్తులు చాట్ చదవకూడదనుకుంటే.. మీరు మీ ఫోన్‌కు ఓ అడ్డు తెరను ఉంచవచ్చు. ఇది వర్చువల్ తెర.. దాని నియంత్రణ మీ చేతుల్లో ఉంటుంది. దీన్ని అప్లై చేసిన తర్వాత మీ స్క్రీన్‌పై ఉన్న సందేశం ఏమిటో పొరుగువారు చూడలేరు. ఇప్పుడు మీరు ఈ వర్చువల్ స్క్రీన్ కోసం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ కోసం ప్లే స్టోర్‌కి వెళ్లి అక్కడ MaskChat-Hides Chat యాప్‌ని టైప్ చేయండి. ఇప్పుడే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. 

చెల్లింపు, ఉచిత సేవ రెండూ

ఇలా పనిచేస్తుంది

మీరు ఈ యాప్‌ని తెరిచినప్పుడు, మీకు స్క్రీన్‌పై ఫ్లోటింగ్ మాస్క్ ఐకాన్ కనిపిస్తుంది. మీ స్క్రీన్‌ని ఇతరులకు కనిపించకుండా దాచాలని మీకు అనిపించినప్పుడు దాన్ని ఆన్ చేయండి. వర్చువల్ తెర ఎంత పెద్దగా ఉంచాలి, ఎంత పారదర్శకంగా ఉంచాలి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. అంతే.. ఈ చిన్న యాప్ చిట్కాతో మీరు చాట్ చేయవచ్చు..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. టెక్ నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే మీ టెక్ నిపుణులను సంప్రదించండి.) 

మరిన్ని సైన్స్ అండ్ టెక్నిిికల్ న్యూస్ కోసం

Latest Articles