Apple iPhone 15: మరిన్ని ఫీచర్స్ తో యాపిల్ IPhone 15 సిరీస్.. మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడో తెలుసా..
IPhone వాడటం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓకళ.. ఎప్పటికైనా ఐఫోన్ కొనుక్కోవాలని టార్గెట్ గా పెట్టుకుంటారు. ఇలా ఐఫోన్ ప్రేమికుల కోసం యాపిల్ ఎప్పటికప్పుడు మరిన్ని ఫీచర్స్ తో అప్ డేట్ వెర్షన్ తో ఫోన్లను..
Apple iPhone 15: IPhone వాడటం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓకళ.. ఎప్పటికైనా ఐఫోన్ కొనుక్కోవాలని టార్గెట్ గా పెట్టుకుంటారు. ఇలా ఐఫోన్ ప్రేమికుల కోసం యాపిల్ ఎప్పటికప్పుడు మరిన్ని ఫీచర్స్ తో అప్ డేట్ వెర్షన్ తో ఫోన్లను తీసుకొస్తుంది. ఇటీవల IPhone 14 సిరీస్ మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు iPhone 15 Pro కూడా మార్కెట్లోకి రానుంది. అయితే దీనికి మరింత సమయం పట్టనుంది. 2023 సెప్టెంబర్ 30వ తేదీన భారత్ లో ఈఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. IPhone 15 సిరీస్ మొబైల్ తగిన స్పెసిఫికేషన్లతో వస్తుందని.. దీని ధర రూ. 1,03,110తో ప్రారంభమవుతుందని ఒక అంచనా. ఆపిల్ తన iPhone 15 Pro లైనప్‌ను కొత్త బయోనిక్ A17 చిప్‌సెట్‌తో ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ తైవాన్ సెమీకండక్టర్ మేకర్ తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TMSC) ద్వారా 3nm ఆర్కిటెక్చర్‌పై నిర్మించనున్నారు. 3nm చిప్‌సెట్ M3 చిప్‌సెట్‌లో కూడా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. Apple Macs కోసం తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TMSC) డెవలప్ చేసిన 3nm ప్రాసెస్ ఆధారిత M3 చిప్‌ను వచ్చే ఏడాది విడుదల చేయనున్న iPhone 15 Pro మోడల్ కోసం ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆపిల్ వచ్చే నెలలో ఐప్యాడ్ ప్రోని M2 చిప్‌తో అప్‌డేట్ చేస్తుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇది TSMC రెండవ తరం 5nm ప్రక్రియ ఆధారంగా తయారు చేశారు. పాత A14 చిప్‌తో కూడిన కొత్త ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్ కూడా ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత వారం టెక్ దిగ్గజం TSMC 4nm ప్రాసెస్ ఆధారంగా A16 చిప్‌తో iPhone 14 ప్రో మోడల్‌లను ఆవిష్కరించింది. అయితే ప్రామాణిక iPhone 14, iPhone 14 Plus మోడల్‌లు మునుపటి తరం A15 చిప్‌తో అమర్చారు. ఇప్పుడు మరిన్ని ఫీచర్స్ తో IPhone 15 సిరీస్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి