New Smart Phones: ఈ వారం విడుదల కానున్న స్మార్ట్ ఫోన్లు ఇవే!
వినియోగదారులను ఆకట్టుకోవాలనే తలంపుతో మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కొత్త ఉత్పత్తులను ప్రకటిస్తుంటాయి.
New Smart Phones Release: వినియోగదారులను ఆకట్టుకోవాలనే తలంపుతో మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కొత్త ఉత్పత్తులను ప్రకటిస్తుంటాయి. అధునాతన ఫీచర్లతో నూతన స్మార్ట్ ఫోన్లను క్రమం తప్పకుండా మార్కెట్లోకి విడుదల చేస్తుంటాయి. అలా ఈ వారం కూడా నాలుగు ప్రముఖ మొబైల్ కంపెనీలు తమ నూతన ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నాయి. అయితే ఇవి భారతదేశంలోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశంఉంది. మరి ఈ వారం రానున్న కొత్త స్మార్ట్ ఫోన్లేంటో, వాటి ఫీచర్లేంటో తెలుసుకుందాం రండి.
మోటోరోలా ఎడ్జ్ ఎస్ స్నాప్ డ్రాగన్ 888 చిప్ సెట్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నెల్ మెమోరీ వంటి అధునాతన ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ ఎస్ మార్కెట్లోకి రానుంది. అదేవిధంగా 108 మెగా ఫిక్సల్ కెమెరా, 25 మెగా ఫిక్సల్ సెల్ఫీ షూటర్ కెమెరా ఉంటుంది. 6.7 అడుగులతో పంచ్ హోల్ డిస్‌ప్లే ఉంటుంది. 5000 ఎం ఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యమున్న ఈ స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 20 న లాంఛ్ కానుంది.
గూగుల్ పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో స్టార్ట్ ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఈ స్మార్ట్ ఫోన్లు అక్టోబర్ 19న మార్కెట్లోకి రానున్నాయి. గూగుల్ హౌస్ టెన్సర్ ఎస్వోసీతో తయారైన ఈ ఫోన్లో టెలిఫొటో జూమ్ లెన్స్(4x) ఉంటుంది. గూగుల్ విడుదల చేసిన వివరాల మేరకు కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, తైవాన్, అమెరికా, ఇంగ్లండ్‌లలో ఈ ఫోన్లు విడుదల కానున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ ఈ గత కొంత కాలంగా వస్తోన్న వదంతులు, అనుమానాలకు తెరదించుతూ ఎట్టకేలకు సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ ఈ అక్టోబర్ 20 న వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అత్యంత ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యంతో 6.4 అడుగుల అమోలెడ్ స్ర్కీన్, స్నాప్ డ్రాగన్ 888 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ తదితర ఫీచర్లు ఈ ఫోన్లో ఉండే అవకాశం ఉంది. అక్టోబర్ 20 నే ఈ ఫోన్ విడుదలవుతున్నా పెద్దసంఖ్యలో మొబైల్స్ తయారుచేయడానికి జనవరి దాకా పట్టే అవకాశం ఉందని సామ్‌సంగ్ ప్రతినిధులు చెబుతున్నారు.
అసుస్ 8 జడ్ స్నాప్ డ్రాగన్ 888 చిప్ సెట్, 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్‌తో ఈ ఫోన్ విడుదల కానుంది. 5000 ఎం ఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీని అదనపు ప్రత్యేకతలు. సుమారు ఐదు నెలల క్రితమే ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి లాంఛ్ అయింది. అయితే ఇప్పటికీ మన ఇండియా మార్కెట్లలోకి రాలేదు. కరోనా మహమ్మారే ఈ ఆలస్యానికి కారణమని అసుస్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
Read Also: భారత మార్కెట్లోకి మోటో కొత్త ఫోన్ వచ్చేసింది.. రూ. 10 వేలలోపే అద్భుతమైన ఫీచర్లు..
సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?