Overture Flight: గంటకు 1200 కి.మీల కంటే వేగంతో ప్రయాణించే విమానాలు.. 2029 నాటికి అందుబాటులోకి..
Overture Flight: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి జపాన్‌లోని ట్యోక్యోకు దూరంగా సుమారు 8260 కిలోమీటర్లు.. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయణించడానికి పట్టే సమయం దాదాపు 11 గంటలు....
Overture Flight: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి జపాన్‌లోని ట్యోక్యోకు దూరంగా సుమారు 8260 కిలోమీటర్లు.. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయణించడానికి పట్టే సమయం దాదాపు 11 గంటలు. అయితే అమెరికాకు చెందిన విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ బూమ్ సూపర్ సోనిక్ కొనుగోలు చేయనున్న ఓవర్ ట్యూర్ అనే విమానాల ద్వారా ఈ దూరాన్ని కేవలం ఆరు గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ విమానాలను వైమానిక దళం కోస సైనిక ‘ఓవర్‌ట్యూర్’ విమానాన్నీ బూమ్ సంస్థ రూపొందిస్తోంది. అయితే తాజాగా ధ్వని కన్నా వేగంతో దూసుకెళ్లే ప్రయాణికుల విమానాలు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం బూమ్ సూపర్‌సోనిక్ అనే అంకుర సంస్థ నుంచి 15 ‘ఓవర్‌ట్యూర్’ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ విమానాలు ప్రస్తుతం అత్యంత వేగంగా దూసుకుపోయే విమానం కంటే రెట్టింపు వేగంతో దూసుకెళుతాయి. 2029 నాటికి వీటి సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నది తమ ఉద్దేశమని పేర్కొంది.
గతంలోనే ఇలాంటి విమానాలు అందుబాటులోకి వచ్చినా..
ఇదిలా ఉంటే 1970లోనే కంకార్డ్ పేరుతో వాణిజ్య సూపర్‌సోనిక్ జెట్‌లను ఎయిర్ ఫ్రాన్స్, బ్రిటిష్ ఎయిర్‌వేస్ సంస్థలు ప్రవేశపెట్టాయి. అయితే పెరుగుతున్న ఖర్చులు, ఆ విమానాల నుంచి వెలువడే ధ్వని వంటి కారణాలతో 2003లో ఆ సర్వీసులకు స్వస్తి పలికాయి. ఇక ప్రస్తుతం అందుబాటులోకి తీసుకురానున్న సూపర్ సోనిక్ విమానంలో ప్రయాణం అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చని బూమ్ సోపర్‌సోనిక్ సీఈవో బ్లేక్ స్కాల్ తెలిపారు. ఈ టికెట్ ధర ఎక్కువగానే ఉంటుందని చెప్పారు.
We’re the first U.S. airline to sign an agreement for @boomaero‘s ‘Overture’ airliners which are expected to be net-zero carbon and connect 500+ cities in nearly half the time. Taking off in 2029: https://t.co/aTeMBwXa10 #BoomSupersonic pic.twitter.com/GOeag9c1HF
— United Airlines (@united) June 3, 2021
Also Read: World Environment Day: రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం.. పర్యావరణంపై చర్చ..
CBSE News Alert: 12వ తరగతి విద్యార్థుల కోసం కీలక అప్‌డేట్… పూర్తి వివరాలు తెలుసుకోండి