Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio New Plans: జియో నుంచి రెండు కొత్త ప్లాన్లు.. బెనిఫిట్స్ చూస్తే అస్సలు వదలరు..

రూ. 739, రూ. 789 ధరతో వస్తున్న ఈ ప్లాన్‌లు 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 5జీ డేటా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్లాన్‌లను ఎంచుకున్న జియో ప్రీపెయిడ్ కస్టమర్‌లు వారి రీఛార్జ్ ప్లాన్‌లలో భాగంగా జీయో సావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్‌లను కూడా అందుకుంటారు.

Jio New Plans: జియో నుంచి రెండు కొత్త ప్లాన్లు.. బెనిఫిట్స్ చూస్తే అస్సలు వదలరు..
Jio
Follow us
Madhu

|

Updated on: Jun 14, 2023 | 6:45 PM

రిలయన్స్ జియో.. టెలికాం రంగంలో ఓ సంచలనం. చవకైన ధరలతో పాటు అదిరే ప్రయోజనాలు అందిస్తూ వినియోగదారులను ఆకర్షించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు మరో రెండు ఆకర్షణీయ ప్లాన్లతో ముందుకొచ్చింది. వీటిల్లో జియో సావన్ సబ్‌స్క్రిప్షన్‌తో సహా అపరిమిత డేటా, కాలింగ్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. జియో ప్రీ పెయిడ్ వినియోగదారులకు 84 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాను అందుబాటులో ఉన్నాయి. నెలవారీ, త్రైమాసిక ప్రయోజనాలను అందిస్తాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్లాన్ల వివరాలు, ప్రయోజనాలు ఇవి..

రూ. 739, రూ. 789 ధరతో వస్తున్న ఈ ప్లాన్‌లు 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తాయి. 5జీ డేటా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్లాన్‌లను ఎంచుకున్న జియో ప్రీపెయిడ్ కస్టమర్‌లు వారి రీఛార్జ్ ప్లాన్‌లలో భాగంగా జీయో సావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్‌లను కూడా అందుకుంటారు. ఇది యాడ్-ఫ్రీ మ్యూజిక్ ను అందిస్తుంది. అపరిమితమైన డౌన్‌లోడ్‌లు, అత్యుత్తమ ఆఫ్‌లైన్ మ్యూజిక్ క్వాలిటీ, జియో ట్యూన్స్ ఫీచర్లను కూడా ఆస్వాదించవచ్చు.

జియో రూ. 739 ప్లాన్ వివరాలు..

ఈ ప్లాన్ కు 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 1.5జీబీ రోజువారీ డేటా తో పాటు 126జీబీ డేటాను అందిస్తుంది. రోజువారీ డేటా పరిమితిని పూర్తయిన తర్వాత నెట్ వేగం 64 కేబీపీఎస్ కు తగ్గుతుంది. అలాగే అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను ఉచితంగా పంపవచ్చు. ఈ ప్లాన్ జియో సావన్, ప్రో జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి యాప్ లను యాక్సెస్ చేసే వీలుంటుంది.

ఇవి కూడా చదవండి

జియో రూ. 789 ప్లాన్ వివరాలు

ఈ ప్లాన్ కూడా 84 రోజుల చెల్లుబాటు, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లతో సహా మునుపటి ప్లాన్‌లకు సమానమైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ఈ ప్యాక్‌తో, వినియోగదారులు మొత్తం 168జీబీ హై-స్పీడ్ డేటాను అందుకుంటారు, అంటే వారు ప్రతిరోజూ 2జీబీ హై-స్పీడ్ డేటాను ఉపయోగించవచ్చు. అదనంగా జియో సావన్, ప్రో జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి యాప్ లను యాక్సెస్ చేయొచ్చు.

మరిన్ని ఆకర్షణీయ ప్రీపెయిడ్  ప్లాన్లు..

  • జియో రూ. 269 ప్లాన్: ఈ ప్లాన్ 1.5 రోజువారీ డేటా క్యాప్‌తో 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.
  • జియో రూ. 529 ప్లాన్: ఈ ప్లాన్ కింద జియో వినియోగదారులు 1.5జీబీ రోజువారీ హై స్పీడ్ డేటాతో 56 రోజుల చెల్లుబాటును పొందుతారు.
  • జియో రూ. 589 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్యాక్‌తో, వినియోగదారులు 56 రోజుల పాటు 2జీబీ రోజువారీ డేటా క్యాప్‌ను పొందుతారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..