AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Infinix Note 30 VIP: ఇన్‌ఫినిక్స్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేసింది.. 108 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్స్‌

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్‌ తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. నోట్‌ 30 వీఐపీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. జూన్‌ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లతో తీసుకొచ్చారు..

Infinix Note 30 VIP: ఇన్‌ఫినిక్స్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేసింది.. 108 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్స్‌
Infinix Note 30 Vip
Narender Vaitla
|

Updated on: Jun 14, 2023 | 6:25 PM

Share

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్‌ తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. నోట్‌ 30 వీఐపీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. జూన్‌ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లతో తీసుకొచ్చారు. 5జీ నెట్‌వర్క్‌తో పనిచేసే ఈ ఫోన్‌ను 8GB,12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. గ్లేసియర్ వైట్, మ్యాజిక్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 24,600గా ఉంది.

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 2,400 x 1,080 పిక్సెల్స్‌తో కూడిన 6.67 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్‌ 13, ఎక్స్‌ఓఎస్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8050 SoC ప్రాసెసర్‌ను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాతోపాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 68 వాట్స్‌ వైర్డు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ఇచ్చారు. అలాగే ఈ స్మార్ట్‌ ఫోన్‌ 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!