AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Cancer: ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోకండి.. బ్రెయిన్‌ క్యాన్సర్‌ కావొచ్చు

అయితే బ్రెయిన్‌ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం వల్ల సరైన చికిత్స అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా సమయానికి క్యాన్సర్‌ను గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. బ్రెయిన్‌ క్యాన్సర్‌ను కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా ఇట్టే పసిగట్టవచ్చని నిపుణులు అంటున్నారు. ఇంతకీ బ్రెయిన్‌ క్యాన్సర్‌తో ఇబ్బందిపడే వారిలో...

Brain Cancer: ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోకండి.. బ్రెయిన్‌ క్యాన్సర్‌ కావొచ్చు
seeds for brain
Narender Vaitla
|

Updated on: May 10, 2024 | 8:19 PM

Share

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల చెడు అలవాట్లు, రసానయనాలతో కూడిన ఫుడ్‌ తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే బ్రెయిన్‌ క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో బ్రెయిన్‌ బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

అయితే బ్రెయిన్‌ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం వల్ల సరైన చికిత్స అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా సమయానికి క్యాన్సర్‌ను గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. బ్రెయిన్‌ క్యాన్సర్‌ను కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా ఇట్టే పసిగట్టవచ్చని నిపుణులు అంటున్నారు. ఇంతకీ బ్రెయిన్‌ క్యాన్సర్‌తో ఇబ్బందిపడే వారిలో ప్రాథమికంగా కనిపించే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మెదడు క్యాన్సర్‌ కణాల పెరుగుదలను బ్రెయిన్‌ క్యాన్సర్‌గా చెబుతుంటారు. మెదడులోని ఈ క్యాన్సర్ కణాలు పెరిగి మెదడులోని వివిధ భాగాలకు వ్యాపిస్తాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. విపరీతమైన తలనొప్పి, దీర్ఘకాలంగా తలనొప్పి సమస్య వేధిస్తుంటే అది బ్రెయిన్‌ క్యాన్సర్‌కు ముందస్తు లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉదయం నిద్రలేవగానే నిరంతరం తలనొప్పి ఉంటే, కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఇక కొన్ని సందర్భాల్లో మూర్చ కూడా బ్రెయిన్‌ ట్యూమర్‌కు ముందస్తు లక్షణంగా చెప్పొచ్చు. చిన్న తనం నుంచి కాకుండా మధ్యలో మూర్చ వచ్చిన వారు కచ్చితంగా మెదడుకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇక బ్రెయిన్‌ క్యాన్సర్‌ కళ్లపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది ఆప్టిక్ నరాల మీద గరిష్ట ఒత్తిడిని కలిగిస్తుంది. అస్పష్టమైన దృష్టి, పూర్తిగా కళ్లు కనిపించకుండా ఉండడానికి ఇది కారణమవుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..