- Telugu News Photo Gallery Technology photos Tecno launching new smartphone Tecno Camon 30 features and price details
Tecno Camon 30: భారత మార్కెట్లోకి మరో ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ అదుర్స్..
ప్రస్తుతం మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతున్నాయి. ముఖ్యంగా మిడ్ రేంజ్ బడ్జెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఇంతకి ఏంటీ ఫోన్.? ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: May 10, 2024 | 9:36 PM

టెక్నో కమోన్ 30 సిరీస్ పేరుతో ఫోన్‌ను లాంచ్ చేస్తున్నారు. త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొస్తున్న ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా మొత్తం నాలుగు ఫోన్‌లను లాంచ్ చేయనున్నారు.

నెట్టింట వైరల్ అవుతోన్న వివరాల ప్రకారం ఈ ఫోన్‌లో మీడియాటెక్ హెలియో జీ99 చిప్ సెట్, టెక్నో కమోన్ 30 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ చిప్ సెట్‌ను ఇవ్వనున్నారు.

అలాగే టెక్నో కమోన్ 30 ప్రో 5జీ, హై ఎండ్ టెక్నో కమోన్ 30 ప్రీమియర్ 5జీ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్వోసీ చిప్ సెట్లతో రానున్నాయి. ఈ ఫోన్‌లో 70 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీలను అందించనున్నారు.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లలో 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్ చేసే కెమెరా ఈ ఫోన్ సొంతం. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం కూడా ఇందులో 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు.

ఇక డిస్‌ప్లే విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లలో 6.78 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించనున్నారు. 1080 x 2436 పిక్సెల్స్ ఈ స్క్రీన్ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.




