Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Camera Phones: ప్రీమియం ధరలో బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. జాబితాలో శామ్సంగ్, ఐఫోన్ వంటి మోడళ్లు..

ఇటీవల కాలంలో మంచి కెమెరా క్వాలిటీ ఉన్న స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. కేవలం ఫోన్ పనితీరు, ర్యామ్, స్టోరేజ్ సైజ్ మాత్రమే కాకుండా వినియోగదారులు కెమెరా నాణ్యతను ప్రత్యేకంగా చూస్తున్నారు. అందుకనుగుణంగానే చాలా స్మార్ట్ ఫోన్ల కంపెనీలు అధిక రిజల్యూషన్ తో కూడిన కెమెరా లెన్స్ తో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి.

Best Camera Phones: ప్రీమియం ధరలో బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. జాబితాలో శామ్సంగ్, ఐఫోన్ వంటి మోడళ్లు..
Samsung Galaxy S23 Ultra 5g
Follow us
Madhu

|

Updated on: Jul 25, 2023 | 3:45 PM

ఇటీవల కాలంలో మంచి కెమెరా క్వాలిటీ ఉన్న స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. కేవలం ఫోన్ పనితీరు, ర్యామ్, స్టోరేజ్ సైజ్ మాత్రమే కాకుండా వినియోగదారులు కెమెరా నాణ్యతను ప్రత్యేకంగా చూస్తున్నారు. అందుకనుగుణంగానే చాలా స్మార్ట్ ఫోన్ల కంపెనీలు అధిక రిజల్యూషన్ తో కూడిన కెమెరా లెన్స్ తో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లెన్స్ ను అమర్చుతున్నాయి. ఈ క్రమంలో మార్కెట్లోని బెస్ట్ కెమెరా ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిల్లో శామ్ సంగ్, యాపిల్, గూగుల్, వన్ ప్లస్ వంటి టాప్ బ్రాండ్లు ఉన్నాయి.

శామ్సంగ్ గేలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ.. శామ్సంగ్ నుంచి వస్తున్న ప్రీమియం మోడల్ స్మార్ట్ ఫోన్ ఇది. దీనిలో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 200ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 12ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 10ఎంపీ పెరీస్కోప్ లెన్స్, 10 ఎంపీ టెలిఫోటో షూటర్ ఉంటాయి. ముందు వైపు సెల్ఫీల కోసం 12ఎంపీ కెమెరా ఉంటుంది. దీనిలో డిస్ ప్లే 6.8 అంగుళాలు ఉంటుంది. 12 జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 1,24,999 ఉంటుంది.

యాపిల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్.. యాపిల్ హై క్వాలిటీ కెమెరాలను ప్రవేశపెట్టింది. దీని వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 48ఎంపీ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 12ఎపీ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ముందువైపు 12ఎంపీ కెమెరా ఉంటుంది. 6.7 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఏ16 బయోనిక్ చిప్ ఉంటుంది. బ్యాటరీ 4323ఎంఏహెచ్ సామర్థ్యంతో పనిచేస్తోంది. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 1,27,999గా ఉంది.

ఇవి కూడా చదవండి

మోటోరోలా రాజ్ఆర్ 40 అల్ట్రా.. ఇటీవల విడుదలైన ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ ఇది. దీనిలో కూడా అధిక రిజల్యూషన్ తో కూడిన కెమెరాలు అందించారు. ఇది ఫోల్డబుల్ ఫోన్. దీనిలో వెనుకవైపు 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ కెమెరా ఉంటాయి. ముందు వైపు 32 ఎంపీ కెమెరా ఉంటుంది. 6.9 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. 4200ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని ధర రూ. 59,999గా ఉన్నాయి.

జియోమీ13 ప్రో.. దీనిలో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మూడూ 50ఎంపీ ఉంటాయి. ముందు వైపు 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్లో 6.73 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంటుంది. 4820ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 79,999గా ఉంది.

వివో వీ23 ప్రో 5జీ.. దీనిలో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 108ఎంపీ ప్రైమరీ కెమరాతో పాటు 8ఎంపీ, 2ఎంపీ కెమెరాలు ఉంటాయి. ముందు వైపు కూడా రెండు కెమెరాలు ఉంటాయి. ఒకటి 50ఎంపీ కెమెరా కాగా, మరొకటి 8ఎంపీ కెమెరా. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. 6.56 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. 4300ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 32,500గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..