Netflix Upgrades: నెట్‌ఫ్లిక్స్‌లో తాజా అప్‌డేట్.. ఇక మీకు కావాల్సిన వీడియోలే వరుసగా వచ్చేస్తాయ్..!

ఇతర ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్స్ నుంచి పెరిగిన పోటీని తట్టుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు యూజర్ ఫ్రెండ్లీ అప్‌గ్రేడ్స్‌ను ఇస్తుంది. తాజాగా వచ్చిన ఓ అప్‌గ్రేడ్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా సేవ్ చేసిన కంటెంట్‌ను ఇంకా చూడని కంటెంట్‌ను చాలా ఈజీగా యాక్సెస్ చేసుకునేందుకు తాజా అప్‌డేట్ ఉపయోగపడనుంది.

Netflix Upgrades: నెట్‌ఫ్లిక్స్‌లో తాజా అప్‌డేట్.. ఇక మీకు కావాల్సిన వీడియోలే వరుసగా వచ్చేస్తాయ్..!
Follow us

|

Updated on: May 24, 2023 | 3:30 PM

కరోనా లాక్‌డౌన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ హవా పెరిగింది. ముఖ్యంగా భారతదేశంలో చాలా మంది ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఎక్కువమంది ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ చూడడానికి ఇష్టపడుతున్నారు. అందులోని వచ్చే షోస్, మూవీ సిరీస్ కారణంగా ఎక్కువమంది నెట్‌ఫ్లిక్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. అయితే ఇతర ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్స్ నుంచి పెరిగిన పోటీని తట్టుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు యూజర్ ఫ్రెండ్లీ అప్‌గ్రేడ్స్‌ను ఇస్తుంది. తాజాగా వచ్చిన ఓ అప్‌గ్రేడ్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా సేవ్ చేసిన కంటెంట్‌ను ఇంకా చూడని కంటెంట్‌ను చాలా ఈజీగా యాక్సెస్ చేసుకునేందుకు తాజా అప్‌డేట్ ఉపయోగపడనుంది. ముఖ్యంగా ఈ కొత్త అప్‌డేట్ మై లిస్ట్ ఫీచర్ వినియోగాన్ని మెరుగుపరుస్తుంది. ఇప్పటికే టీవీల్లో ఉన్న ఈ అప్‌డేట్ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్‌లో వినియోగానికి సిద్ధంగా ఉంది. 

మై లిస్ట్‌లో ఫిల్టర్స్  

సాధారణంగా మనం చూడాలనుకునే కంటెంట్ ప్రయారిటీని మనం మైలిస్ట్‌లో సేవ్ చేసుకుంటాం. లేకపోతే ఏదైనా కంటెంట్ చూస్తూ మధ్యలో ఆపేస్తే ఆ వీడియో కూడా మైలిస్ట్‌లో ఉంటుంది. అలాగే మన కంటెంట్ ప్రయారిటీని అందులో సెట్ చేసుకుంటాం. అయితే నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన తాజా అప్‌డేట్ ద్వారా కంటెంట్ విడుదల తేదీ, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం వచ్చే అవకాశాన్ని కల్పించింది. ఇది వినియోగదారులు వారి ప్రాధాన్యత ప్రకారం కంటెంట్‌ను చూసే వీలు కల్పిస్తుంది. గతంలో ఈ ఫిల్టర్ అందుబాటులో లేని సమయంలో వినియోగదారులు వారికి కావాల్సిన కంటెంట్ కోసం శీర్షికల ద్వారా సెర్చ్ చేయాల్సి వచ్చేది. అయితే ఆ కంటెంట్ పొందడం కాస్త కష్టతరంగా ఉండేది. అయితే నవీకరించిన ఈ కొత్త ఫీచర్ రాబోయే కొద్దిరోజుల్లోనే వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. కంపెనీ ఇటీవల పాస్‌వర్డ్స్ షేరింగ్‌కు సంబంధించి కఠిన నియమాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమర్శలకు చెక్ పెడుతూ కంటెంట్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో