AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motorola Edge 40: సూపర్ స్లిమ్ డిజైన్.. సెన్సేషనల్ ఫీచర్స్.. మోటోరోలా కొత్త 5జీ ఫోన్ మామూలుగా లేదుగా..

మోటోరోలా 5జీ వేరియంట్లో తన సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు మోడళ్లను ఆకర్షణీయమైన ఫీచర్లతో లాంచ్ చేసిన ఆ కంపెనీ తాజాగా మరో అత్యద్భుతమైన ఫోన్ ను ఆవిష్కరించింది. మోటోరోలా ఎడ్జ్ 40 పేరుతో వచ్చిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్ సూపర్ స్లిమ్ డిజైన్ తో ఆకట్టుకుంటోంది.

Motorola Edge 40: సూపర్ స్లిమ్ డిజైన్.. సెన్సేషనల్ ఫీచర్స్.. మోటోరోలా కొత్త 5జీ ఫోన్ మామూలుగా లేదుగా..
Moto Edge 40
Madhu
|

Updated on: May 24, 2023 | 3:00 PM

Share

మోటోరోలా 5జీ వేరియంట్లో తన సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు మోడళ్లను ఆకర్షణీయమైన ఫీచర్లతో లాంచ్ చేసిన ఆ కంపెనీ తాజాగా మరో అత్యద్భుతమైన ఫోన్ ను ఆవిష్కరించింది. మోటోరోలా ఎడ్జ్ 40 పేరుతో వచ్చిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్ సూపర్ స్లిమ్ డిజైన్, ఈ-సిమ్ సపోర్టు, వైర్ లెస్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉండే పీ ఓఎల్ఈడీ డిస్‍ప్లే వంటి అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

లుక్, డిజైన్.. ఈ కొత్త మొబైల్ లుక్ అదిరిపోయింది. సూపర్ స్లిమ్.. అంటే కేవలం 7.58 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. స్లీక్ డిజైన్‍తో వచ్చింది. ఈ ఫోన్ బరువు కూడా 171 గ్రాములే ఉంటుంది. రసెడా గ్రీన్, ఎక్లిప్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లు వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ ఫినిష్‍ను కలిగి ఉన్నాయి. లునార్ బ్లూ కలర్ వేరియంట్ అక్రిలిక్ ప్యానెల్‍తో వచ్చింది.

డిస్ ప్లే ఇలా ఉంటుంది.. 6.55 ఇంచుల కర్వ్డ్ ఫుల్ హెచ్‍డీ ప్లస్ పీఓఎల్ఈడీ డిస్‍ప్లేను కలిగి ఉంది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, హెచ్‍డీఆర్10+ ప్లస్ సపోర్ట్ ఉంటాయి. గేమింగ్, స్క్రోలింగ్ లేదా మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు, వినియోగదారులు తమ పరికరాన్ని సజావుగా నావిగేట్ చేయడానికి వేగవంతమైన ఫ్లూయిడ్ 144Hz రిఫ్రెష్ రేట్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. సినిమా వీక్షణ అనుభవం కోసం డాల్బీ ఆట్మోస్ ఆడియో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పనితీరు ఇలా.. ఈ ఫోన్‍లో మీడియాటెక్ డైమన్సిటీ 8020 ప్రాసెసర్ ఉంది. ఈ ప్రాసెసర్‌తో లాంచ్ అయిన తొలి మొబైల్‍గా ఇది నిలిచింది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍‍తో ఇది పనిచేస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 40 వెనుక రెండు కెమెరాల సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్ ఉండే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. అల్ట్రా వైడ్ లెన్స్ మాక్రో కెమెరాగానూ ఉయోగపడుతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‍కు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

అత్యాధునిక ఫీచర్లు.. ఇక ఫీచర్ల విషయానికి వస్తే డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లను ఈ మొబైల్ కలిగి ఉంది. డ్యుయల్ 5జీ సిమ్ సపోర్ట్ ఉంటుంది. ఓ ఫిజికల్ సిమ్, మరో ఈ-సిమ్‍కు సపోర్ట్ చేస్తుంది. మిడ్ రేంజ్‍లో ఈ-సిమ్ సపోర్టుతో వచ్చిన తొలి ఫోన్‍ ఇదే కావడం విశేషం. మోటోరోలా ఎడ్జ్ 40 మొబైల్‍లో 4,400ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 68 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 15 వాట్ల వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్‍ను ఈ ఫోన్ కలిగి ఉంది.

ధర, లభ్యత.. మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ ఒకే వేరియంట్‍లో లాంచ్ అయింది. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ ధర రూ.29,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ లో ఈ మొబైల్ ప్రీ-ఆర్డర్లు మొదలయ్యాయి. మే 30వ తేదీన ఫ్లిప్‍కార్ట్ సహా మోటోరోలా కంపెనీ వెబ్‍సైట్లో సేల్‍కు వస్తుంది. ఎక్లిప్స్ బ్లాక్, నెబ్యూలా గ్రీన్, లునార్ బ్లూ కలర్ ఆప్షన్‍లలో ఈ ఫోన్ లభిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై మరో కీలక అప్డేట్
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై మరో కీలక అప్డేట్
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా..
మూసీ తీరంలో గాంధీ సరోవర్.. ఎన్ని కోట్లతో కడుతున్నారంటే?
మూసీ తీరంలో గాంధీ సరోవర్.. ఎన్ని కోట్లతో కడుతున్నారంటే?
ఇవి మీ ఇంటి దగ్గరుంటే పాములు పరుగెత్తుకుంటూ వస్తాయి..
ఇవి మీ ఇంటి దగ్గరుంటే పాములు పరుగెత్తుకుంటూ వస్తాయి..
బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌.. ఇక అది ఉండదు!
బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌.. ఇక అది ఉండదు!
వారికి ఆదాయానికి లోటు లేకున్నా.. చేతిలో నయా పైసా నిలవదు..!
వారికి ఆదాయానికి లోటు లేకున్నా.. చేతిలో నయా పైసా నిలవదు..!
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..
నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..
ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్
ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్